Garlic Health Benefits: వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే మరీ మంచిది నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.  లివర్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు వెల్లుల్లిలో ఎంతో శక్తివంతమైన పోషకాలు ఉంటాయి.  ప్రతిరోజు నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక వెల్లుల్లి రెబ్బను తల కింద పెట్టుకొని పడుకోవాలి నిద్ర బాగా పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా వెల్లుల్లి రక్తం చిక్కబడకుండా చేస్తుంది కరోనరీ వ్యాధులు రాకుండా సహాయం పడుతుంది, పక్షవాతం రాకుండా నివారిస్తుంది
 వెల్లుల్లిలో బ్లడ్ థిన్నింగ్ అజోయ్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల రక్తం చిక్కబడకుండా  సహాయపడుతుంది
అజోయిన్ రక్తంలోని ప్లేట్లెట్స్ ను దూరంగా జరిపి రక్తం గడ్డ పడకుండా కాపాడుతుంది. యాజోయిన్ అనే సల్ఫర్ కాంపౌండ్ రక్తంలో గడ్డ కట్టకుండా చేస్తుంది. రక్తనాళాలు సన్నగా ఉన్న వారికి రక్తంలో కొవ్వు పేరుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. అలాంటి సమయంలో పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. ఇలా రక్తంలో గడ్డ కట్టడం వల్ల చిన్న వయసులోనే గుండెపోటు సమస్య వస్తుంది వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది. వెల్లుల్లిని పచ్చిగా తింటేనే ఎక్కువ ప్రభావంతంగా పనిచేస్తుంది. సాధారణంగా మనం వంటల్లో వెల్లుల్లి వాడినప్పుడు నూనెలో వేడి నూనెలో వేసి వేయిస్తాం. దీనివల్ల సల్ఫర్ కాంపౌండ్ అజోయిన్ అనే కెమికల్ నాశనం అవుతుంది. 


ఇదీ చదవండి:  పుచ్చకాయను సగం కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..


వెల్లుల్లి నాచురల్ బ్లడ్ థిన్నర్ హై బీపీ ఉన్నవారికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వంట చేసేటప్పుడు చివరలో వెల్లుల్లిని దంచి వేసుకున్న ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వెల్లుల్లి శరీరంలో నొప్పులను తొలగిస్తుంది. చిన్నపిల్లల్లో కఫదోషాలను కూడా తగ్గిస్తుంది. బాలింతలకు కూడా వెల్లుల్లిని కలిపి పెడతారు. నిత్యం వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం కాకుండా కొన్ని రకాల ఆహారాల్లో మాత్రమే వెల్లుల్లిని ఉపయోగించాలి. వెల్లుల్లి రక్తాన్ని పలుచబడే గుణం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ తో బాధపడేవారు పచ్చివెల్లుల్లని తినాలంట. అన్నం ఉడికిపోయినప్పుడు వెల్లుల్లిని వేస్తారు. అప్పుడు కాస్త ఉడుకుతుంది. అప్పుడు వెల్లుల్లిని నమిలి మింగాలి.


ఇదీ చదవండి: సద్దురు జగ్గీ వాసుదేవ్‌కు మెదడులో రక్తస్రావంతో సర్జరీ.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?


చాలామంది వెల్లుల్లిని ఉదయం సమయంలో తింటారు. రక్తనాళాలు బాగా వేడల్పుగా మారి రక్త సరఫరాకు మార్గం సుగమం అవుతుంది. కానీ, అధిక స్థాయిలో వెల్లుల్లిని తినడం వల్ల వేడి చేస్తుంది. చెట్లకు చీడ పీడా పట్టిన వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి వేయాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter