Ice Apple Health Benefits: మండే ఎండలకు ఏ ఆహారం తీసుకుంటే మన శరీరం చల్లగా ఉంటుందని ఆలోచిస్తుంటాం.  పైనుంచి భానుడి భగభగ లోపల వేడి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు ఏవో వెతుకుతూ ఉంటాం. ఈ సమ్మర్ స్పెషల్ ఒక ప్రత్యేకంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది కేవలం ఎండాకాలంలో కనిపించే ఈ పండు తరతరాల నుండి మన పూర్వీకులు కూడా దీని ఆస్వాదిస్తున్నారు. అవే తాటి ముంజలు ఎండాకాలం రాగానే తాటి ముంజలు మార్కెట్లో కనిపిస్తాయి ఇవి తాటి చెట్ల కాస్తాయి. ఈ పండు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిలో కడుపును చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. ఈ పండు చూడడానికి లిచీ పండు మాదిరిగా ఉంటుంది. లోపల కొబ్బరిమీగడ లాంటి పదార్థం ఉంటుంది ఈ పండ్లను నేరుగా తినవచ్చు లేదా కీర్ పాయసం, ఫలుదా ఐస్ క్రీమ్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు చూడటానికి ఐస్ ముక్కల్లో ఉంటాయి అందుకే వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్స్ అని కూడా అంటారుఈ వేసవి కాలంలో వచ్చే తాటి ముంజలకు భలే గిరాకీ కూడా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, కే, నియాసిన్ ,రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి.


మూడు తాటి ముంజలు ఒకరు కొబ్బరి బొండంతో సమానం అంటారు 100 గ్రాముల ముంజలు 43% క్యాలరీలు ఉంటాయి. ముంజలు తినేటప్పుడు పైపొట్టును తీసేసి తింటారు. కానీ ఆ ఫోటోలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ పొట్టు వల్ల శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది.


ఇదీ చదవండి: ఈ 4 మూలికలు వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతాయి..


మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా ఈ తాటి ముంజల నీరు చలువ చేస్తాయి ముఖ్యంగా పిల్లలకు ముసలి వాళ్లకు ఇది ఎంతో ఆరోగ్య కరం. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చు, దాహార్తికి కూడా మంచి విరుగుడు.అంతేకాదు వాంతులు వికారం వచ్చినప్పుడు కూడా తాటి ముంజలు తినడం అలవాటు చేసుకోండి.


ఇదీ చదవండి:షుగర్ పేషంట్లకు 7 బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్స్‌.. రక్తంలో చక్కెరస్థాయిలను పెరగనివ్వవు..


గర్భిణీలు తాటి ముంజలు తినడం వల్ల మలబద్ధక సమస్యకు చెక్ పెట్టొచ్చు.వేసవికాలంలో వచ్చే చెమటకాయలను తగ్గిస్తుంది. అంతేకాదు తాటి ముంజలు శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter