Monkeypox Virus కరోనా మహమ్మారి నియంత్రణలో రాకుండానే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో అరుదైన మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించారు. 20 ఏళ్ల తరువాత తిరిగి వెలుగులోకి వచ్చిందని అమెరికాలో సీడీసీ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచమంతా ఇప్పటికే కరోనా మహమ్మారి(Corona pandemic)తో అల్లాడుతోంది. ఇంకా వైరస్ అదుపులో రాలేదు. ఈ నేపధ్యంలో మరో కొత్త వైరస్ ఆందోళన కల్గిస్తోంది. అదే మంకీపాక్స్ వైరస్. అమెరికాలో దాదాపు 20 ఏళ్ల తరువాత తిరిగి ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. అమెరికాలోని టెక్సాస్‌లో(Texas)మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)వెల్లడించింది. బాధితుడు ఇటీవల నైజీరియా వెళ్లొచ్చినట్టుగా తెలిసింది. డల్లాస్ ఆసుపత్రిలో మంకీపాక్స్ వైరస్ (Monkeypox virus)సోకిన వ్యక్తికి చికిత్స అందుతోంది. ఈ రోగితో కాంటాక్ట్ ఉందనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణీకులపై దృష్టి సారించారు.


స్మాల్‌పాక్స్ వైరస్(Smallpox virus)జాతికి చెందిన వైరస్‌గా భావిస్తున్నారు. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ప్రజల ప్రాణాలకు పెద్దగా ముప్పు ఉండదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తుంపర్ల కారణంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉన్నప్పటికీ..కరోనా వైరస్ కారణంగా మాస్క్ ధరిస్తున్నందున వ్యాపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.అమెరికాలో తొలిసారిగా ఈ వ్యాధిని 2003లో గుర్తించారు. అప్పట్లో ఈ వ్యాధి 47 మందికి సోకింది. మంకీపాక్స్ వైరస్ అనేది మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని రిమోట్ ప్రాంతాల్లో ఎక్కువగా సంభవించే అరుదైన వైరల్ వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తెలిపింది. ఫ్లూతో మొదలై లింఫ్‌నోడ్స్‌లో వాపు, శరీరంపై భారీగా దద్దుర్లు రావడం జరుగుతుంది. 2-3 వారాల వరకూ వ్యాధి లక్షణాలుంటాయి.


Also read: Mint Benefits: పుదీనా తింటున్నారా, ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook