Amla Health Benefits: ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరి అంటేనే విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్. రోజుకొక్క ఉసిరికాయ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే..ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో ఎన్నో రకాల వనమూలికలు, ఔషధాలు, పండ్లు, కూరగాయలు లభిస్తుంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సమృద్ధిగా ఉంటుంది. ప్రకృతిలో లభించే ప్రతి దాంట్లో ఆరోగ్యానికి మేలు చేకూర్చే అంశాలు చాలానే ఉంటాయి. అన్నింటిలో ప్రధానంగా చెప్పుకోవల్సింది ఉసిరికాయ. సి విటమిన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. విటమిన్ సి సమృద్ధిగా లభించేది ఇందులోనే. ఉసిరికాయతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అనాదిగా పెద్దల కాలం నుంచి వాడుతున్నవే. అయితే ఉసిరిని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదనేది కూడా ఉంది. అవేంటో తెలుసుకుందాం. ఎందుకంటే వాడాల్సిన విధానంలో తీసుకుంటేనే ఉసిరితో (Amla Health Benefits) ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.


ఉసిరి ప్రయోజనం కదా అని చాలా మంది ఉసిరి పచ్చడి, ఉసిరి మిఠాయిలు తింటుంటారు. కానీ ఇది మంచిది కాదనేది వైద్య నిపుణుల మాట. ఉసిరికాయ ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందాలంటే..పచ్చిగానే తినాల్సి ఉంటుంది. ఉసిరిని పచ్చిగా తీసుకుంటేనే లాభాలెక్కువ. ఉసిరికాయల్ని ఎప్పుడూ ఇనుప కత్తితో కోసి తినకూడదని చాలామందికి తెలియదు. వీలైనంతవరకూ పంటితో కొరికి తింటే చాలా మంచిది. లేని పక్షంలో స్టీల్ కత్తిని మాత్రమే వాడాలి. ఇక మరో ముఖ్యమైన అంశం ఉసిరికాయల్ని ఎప్పుడూ ముక్కలుగా కోసి ఉంచుకోకూడదు. ఉసిరిని కోసిన వెంటనే తినేయడం మంచిది. రుచి కోసం కాస్త ఉప్పు వేసుకుంటే మంచిదే. రోజుకొక్క ఉసిరి తీసుకుంటే జీవితంలో ఎప్పుడూ  విటమిన్ సి లోపముండదు. శరీరానికి కావల్సిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కీలకంగా ఉండే రోగ నిరోధక శక్తిని ఇచ్చేది విటమిన్ సి (Vitamin C) మాత్రమే. 


విటమిన్ సి లోపంతో తరచూ ఎదురయ్యే చాలారకాల సమస్యల్నించి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా నోటి పూత, నోటి అల్సర్లకు ప్రధాన కారణం విటమిన్ సి లోపమే. విటమిన్ సి లోపంతోనే తరచూ ఎలర్జీ కారణంగా జలుబు వస్తుంటుంది. విటమిన్ సి ట్యాబ్లెట్లకు బదులు..రోజుకో ఉసిరికాయ తీసుకుంటే ఈ సమస్యలేవీ దరిచేరవు.


Also read: World Cancer Day: ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, ఈ లక్షణాల్ని అస్సలు విస్మరించకూడదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook