ప్రస్తుతం అంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధకశక్తి పెంచుకోవడం (Immune System Boosters) ఎలా.. ఎలాంటి ఆహారం మన శరీరాన్ని వీక్‌నెస్ వైపునకు తీసుకెళ్తుందని తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడమే అందుకు కారణం. అయితే మీ ఆరోగ్యం కోసం చల్లనివి తాగకూడదు, తినకూడదంటూ వైద్యులు, అధికారులు సలహాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమూల్ తమ కస్టమర్ల ఆరోగ్యం కోసం హల్దీ ఐస్‌క్రీమ్‌ (Turmeric Ice Cream)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యాధి నిరోధకశక్తిని పెంచడం కోసం అల్లం (Ginger), పసుపు (Turmeric), తులసి (Basil), మిరియాలు లాంటివి తినాలని.. వేడి వేడిగా కషాయాలు తాగాలని ఈ మధ్య తరచుగా వింటూనే ఉన్నాం. తమ వ్యపారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కస్టమర్ల ఆరోగ్యాన్ని కాపాడటంతో భాగంగా అమూల్ సంస్థ పసుపు ఐస్‌క్రీమ్ (Haldi Ice Cream) ను తెచ్చింది. ఈ ఐస్‌క్రీమ్‌లో తులసి, పసుపు, అల్లం, పాలు, తేనే, బాదం, కర్జూరం.. లాంటి మిశ్రమాలున్నాయని.. దీంతో మీ ఆరోగ్యం గురించి బెంగ అక్కర్లేదని ట్వీట్ ద్వారా తెలిపింది. 125ml హల్దీ ఐస్‌క్రీమ్‌ ధర రూ. 40గా అమూల్ నిర్ణయించింది. COVID19 Medicine: రూ.59కే కరోనా ట్యాబ్లెట్..



పసుపు ఐస్‌క్రీమ్‌తో పాటు త్వరలోనే అల్లం ఐస్‌క్రీమ్, తులసి ప్లేవర్ ఐస్‌క్రీమ్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని అమూల్ సంస్థ ప్రకటించింది. రోగ నిరోధకశక్తిని మెరుగు పరచడంలో భాగంగా ఇటీవల ఓ సంస్థ చవాన్‌ప్రాష్ ఐస్‌క్రీమ్‌ను అందించింది. తర్వాత కాకరకాయ ఐస్‌క్రీమ్, మిరియా ఐస్‌క్రీమ్ కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమూల్ కొత్త ఐస్‌క్రీమ్ రచులు మమ్మల్ని నిరాశ పరచవని ఆశిస్తున్నామంటూ ఐస్‌క్రీమ్ ప్రియులు స్పందిస్తున్నారు. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా? 
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..