Constipation And Indigestion: అంజీర్‌తో మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?
Anjeer For Constipation And Indigestion: చలి కాలంలో వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి అంజీర్ పండ్లు శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని మీరు ప్రతి రోజూ అంజీర్ పండ్లను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Anjeer For Constipation And Indigestion: అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే చాలా మంది అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటున్నారు. వీటిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌ను ఎక్కువగా ఆహారంగా వినియోగిస్తే అన్ని దీర్ఘకాలీక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వింటర్ సీజన్ వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియంలు అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాల లోపం సమస్యలు తగ్గుతాయి.
చలికాలంలో అంజీర్ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. చలికాలంలో అంజీర్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చదనంగా మారే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. వీటిని క్రమంగా వినియోగిస్తే సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
2. చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమస్య తీవ్ర వ్యాధిగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అంజీర్ పండ్లను ఆహారంలో తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది చల వల్ల వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
3. చలి కారణంగా చాలా మందిలో పొట్ట సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కడుపులో మంట మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అంజీర్ పండ్లను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే
Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook