Sleepless: మనిషి ఆరోగ్యానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో..నిద్ర కూడా అంతే. ఆధునిక జీవవ శైలి, ఒత్తిడి, తీవ్రమైన పని, స్మార్ట్ ఫోన్ల దుష్పరిణామాలన్నీ నిద్రపై పడుతుంటాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఎదురయ్యే సమస్యలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజుకు 8 గంటల నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌తో ఉంటున్నారు. అనునిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. లేదా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లతో గడుపుతున్నారు. మనిషికి సరైన ఆహారం ఎంత అవసరమో..సరైన నిద్ర కూడా అంతే అవసరమనే వాస్తవాన్ని గ్రహించడం లేదు. ఒకట్రెండు రోజులైతే ఫరవాలేదు. కానీ అదే పనిగా నిద్ర సరిగా లేకపోతే..ఆరోగ్యంపై దుష్పరిణామాలకు దారి తీస్తుంది. రోజుకు 7-8 గంటలు కచ్చితంగా నిద్ర అవసరమనేది వైద్యుల సూచన. రోజుకు 7-8 గంటల నిద్ర తక్కువైతే మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటుంది. 


ముఖ్యంగా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. జీవక్రియలో అవకతవకలు ఏర్పడుతాయి. రోగ నిరోధక శక్తి (Immunity)క్షీణించే అవకాశాలున్నాయి. కొన్ని రకాల పరిశోధనల ప్రకారం ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ( Diabetes), క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం నిద్రలేమితో పెరుగుతుంది. రోజుకు కావల్సిన నిద్ర తక్కువైతే..జీర్ణ ప్రక్రియ సామర్ధ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే సామర్ధ్యం కూడా తగ్గుతుంది. ఇది పలు రకాల సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, బీపీ సమస్యలు పెరగవచ్చు. ముఖ్యంగా రాత్రి నిద్ర తక్కువైతే మాత్రం కచ్చితంగా జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్నారు వైద్య నిపుణులు. 


అందుకే ఆరోగ్యకరమైన జీవితం కోసం కచ్చితంగా రోజుకు 8 గంటల నిద్ర ఉండాల్సిందే అంటున్నారు వైద్యులు. నిద్ర తక్కువైతే (Sleepless ) ఆరోగ్యపరంగా అంతర్గతంగా సమస్యలే కాకుండా బాహ్య సౌందర్యం కూడా తగ్గుతుందనేది గమనించాలి. కళ్ల కింద చారలు, నల్లటి వలయాలు (Dark Circles) కూడా నిద్రలేమితోనే ఏర్పడతాయి. కొందరు పని ఒత్తిడి లేదా నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల నిద్ర తగ్గుతుంది. మరి కొందరికి ఒత్తిడి, వివిధ రకాల ఆలోచనలు, సమస్యలు, యూత్ అయితే స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిపోవడం వల్ల నిద్రకు దూరమవుతుంటారు. ఒకవేళ ఏకధాటిగా 8 గంటల నిద్ర సాధ్యం కాకపోతే..దశలవారీగా పూర్తి చేయవచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ రాత్రిపూట 4-5 గంటలే నిద్రపోతుంటే..మద్యాహ్నం వేళల్లో మిగిలిన నిద్రను పూర్తి చేసుకున్నా ఫరవాలేదు. 


నిద్ర ఎప్పుడూ దశల్లో ఉంటుంది. మొదటి దశలో నిద్ర అనేది కొన్ని నిమిషాలే ఉంటుంది. రెండవ దశలో తేలికపాటి నిద్ర ఉంటుంది. ఇందులో శరీర ఉష్ణోగ్రత పడిపోయి..కళ్ల కదలిక ఆగిపోతుంది. ఈ దశ 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఇక మూడవ దశ నిద్ర. స్లో వేవ్ స్లీప్ అంటారు. ఈ మూడవ దశే ఆరోగ్యానికి మంచిది. ఈ నిద్ర లోపిస్తేనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చేరుతాయి. 


Also read: Amla Health Benefits: రోజుకొక ఉసిరికాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook