Jowar Roti Recipe Making: ప్రస్తుత కాలంలో చాలా మంది ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. చాలా మంది జొన్న రొట్టెను తీసుకోవడం మనం చూస్తున్నాము. జొన్న రొట్టె బరువును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్‌ను కంట్రోల్‌ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. దీని తీసుకవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే చాలా మంది బయట కంటే ఇంట్లో నే జొన్న రొట్టెను తయారు చేసుకోవడానికి ఇష్టపడుతారు. అయితే మనం ఇంట్లో చేసే రొట్టెలు అంత బాగా రాకుండా ఉంటాయి.  చపాతీలలా తేలిగ్గా రావు, విరిగిపోతాయి, ఆ విరిగిన వాటిని ఎలాగోలా కాల్చుకుని తింటే మనకు నచ్చదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చపాతీలు చేసినంత సులభం కాదు జొన్నరొట్టెలు చేయడం. అయితే జొన్న రొట్టెలు కూడా చపాతీల రావడానికి ఒక చిన్న ట్రిక్‌ ఉంది. దీని ఉపయోగించి మీరు జొన్న రొట్టెను తయారు చేసుకోవడం వల్ల ఎంతో రుచికరమైన రొట్టె మీరు ఇష్టంగా తినవచ్చు. 


జొన్న రొట్టె చేసేటప్పుడు ఈ టిప్స్:


జొన్న రొట్టెల్ని చేసుకోవడానికి ముందుగా మీరు ఒక మందపాటి గిన్నెను  గ్యాస్‌ మీద పెట్టుకోవాలి. ఆ తరువాత ఒ గ్లాస్‌ నీళ్లు తీసుకోవాలి దీని మరగబెట్టుకోవాలి. అందులోకి ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఓ కప్పు జొన్న పిండిని తీసుకొని కలుపుకోవాలి. గరిటెతో బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టి పది నిమిషాల తర్వాత 
గోరు వెచ్చగా ఉన్నప్పుడే పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. దీనిలో జిగురు ఉండదు కాబట్టి ఇలా చేయడం వల్ల జిగురు ఏర్పడుతుంది. రొట్టెలు చేయడానికి చక్కగా మెత్తగా వస్తాయి.


చపాతీ కర్రతో చేసుకోవాలంటే కాస్త జొన్న పిండిని చల్లుకుని చపాతీల్లా ఒత్తుకోవడం వల్ల రొట్టెలు బాగా వస్తాయి. అయితే చపాతీలను చేసినంత బలంగా వీటిపై ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదు.దీని కారణంగా ఇవి విరిగిపోతాయి. తేలికపాటి బలం ఉపయోగించి మాత్రమే వీటిని ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని గుండ్రంగా చేసి పక్కనుంచుకోండి.


ఇప్పుడు వీటిని పెనం మీద పెట్టకోవాలి. రొట్టెను వేసుకున్న వైపు నీళ్లలో ముంచిన తడిగుడ్డతో లేదా చేతినే నీళ్లలో ముంచి రొట్టె అంతటా రాయండి. లేదంటే రొట్టె విరుగుతుంది. మీడియం మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకోండి.   చక్కగా పొరలు పొరలుగా జొన్న రొట్టెలు రెడీ అవుతాయి.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter