Arthritis Impact: మనిషి ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎప్పుడూ బాధిస్తుంటాయి. అందులో ముఖ్యమైంది ఆర్థరైటిస్. ఈ సమస్యకు ప్రధాన కారణం ఫిట్నెస్‌తో పాటు వివిధ రకాల పోషకాలు లోపించడం. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సువారిలో కూడా కన్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్థరైటిస్ అనేది సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్య. ప్రత్యేకించి చలి పెరిగినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువౌతుంటుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల ప్రస్తుతం నడి వయస్సులోనే జాయింట్ పెయిన్స్ బారినపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాల్సిన వయస్సులో ఆర్థరైటిస్ బారినపడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది, ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి..


ఇటీవలి కాలంలో ఆర్థరైటిస్ మరీ ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్ధరైటిస్ సమస్య యువకుల్లో ఎక్కువగా కన్పిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఆస్టియో ఆర్ధరైటిస్ మరింత ప్రమాదకరంగా చెప్పవచ్చు. పిల్లలు, యువకులు కూడా ఈ వ్యాధి బారినపడుతుండటం ఆందోళన కల్గించే విషయంగా మారింది. ఒకప్పుడు మాత్రం ఈ వ్యాధి కేవలం వృద్ధుల్లో కన్పించేది. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ బాధిస్తోంది. 


యువకుల్లో ఆర్ధరైటిస్ సమస్యలు కారణాలు చాలానే ఉన్నాయి. స్థూలకాయం, అస్తవ్యస్థ జీవనశైలి, పోశ్చర్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి కల్గించే క్రీడలు ఆడటం, కీళ్లలో గాయాలు, జెనెటిక్ కారణాలు వంటివి కారణం కావచ్చు. జాయింట్ పెయిన్స్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. తరచూ కండరాల నొప్పి కూడా మరో కారణం.


జీవనశైలిని సక్రమంగా మల్చుకుని, ఒత్తిడి తక్కువగా కల్గించే వ్యాయామం చేస్తుంటే ఆర్థరైటిస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. హైలూరోనిక్ ఇంజెక్షన్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా వంటి అడ్వాన్స్‌డ్ చికిత్సా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పరిస్థితి విషమంగా ఉంటే సర్జరీ కూడా అవసరమౌతుంది. ఇందులో ఆర్ధోస్కోపీ లేదా జాయింట్ రీప్లేస్‌మెంట్ చివరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. యువకుల్లో త్వరగా ఈ వ్యాధిని గుర్తించగలిగితే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల్నించి రక్షించుకోవచ్చు. అందుకే కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు తరచూ బాధిస్తుంటే నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 


Also read: Weight Loss: నల్ల మిరియాలు రోజు ఇలా తీసుకుంటే బరువు తగ్గడమే, చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోవాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook