Asian Tiger Mosquito: భారత్లో దోమల ద్వారా సంక్రమించే చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా కాకుండా చాలా రకాల ప్రాణాంతక వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తున్నాయి. అయితే దోమలు కుట్టడం వల్ల కొంతమందిలో  డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండొచ్చు.. మరి కొంతమందిలో ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఆసియా టైగర్ దోమ కుట్టడం వల్ల పై వ్యాధులు రాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ దోమ ఒక్కసారి కాటేస్తే జీవితాంతం కోమాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆసియన్ టైగర్ దోమ కుట్టడం వల్ల కలిగే ఇతర వ్యాధులెందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనుషుల రక్తమే కాకుండా జంతువుల రక్తాన్ని కూడా తాగుతుంది..!
సాధారణంగా దోమలు రాత్రిపూట మాత్రమే కుడతాయి. కానీ ఎల్వా ఆల్బోపిక్టస్ దోమ పగటిపూట, రాత్రిపూట కుడుతుంది. ఒకానొక సందర్భంలో ఇది మరింత వింతగా ఉంటుంది. దోమలు మనుషుల రక్తాన్ని తాగుతాయి. మానవులే దాని మొదటి ఎంపిక. కానీ ఒక వ్యక్తి రక్తం అందుబాటులో లేకుంటే.. ఈ ఆసియన్ దోమ జంతువు రక్తాన్ని కూడా తాగుతుంది. ఇప్పుడు ఈ దోమలు యూరప్ దేశాలతో పాటు అమెరికాకు కూడా వ్యాపించాయి. 


భారతదేశంలో ఈ వ్యాధుల ప్రధాన కారకాలు:
డెంగ్యూ: 

భారతదేశంలో డెంగ్యూ సాధారణంగా ఏడిస్ ఈజిప్టి దోమ కాటు వల్ల వస్తుంది. దీనినే చాలామంది డెంగ్యూకు సంబంధించిన దోమ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపిస్తుంది.


చికున్‌గున్యా : 
చికున్‌గున్యా వ్యాధి ఈడిస్ ఈజిప్టై దోమ కాటు వల్ల వస్తుంది. తీవ్రమైన వ్యాధి కాకపోయినా శరీరంలోని రోగలిరోధక శక్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు ఇతర సమస్యలకు దారి తీసేందుకు భయపడుతుంది. ఈ చికెన్ గున్యా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది.


వెస్ట్ నైలు జ్వరం: 
ఈ జ్వరం కూడా ఈడెస్ ఆల్బోపిక్టస్ దోమ కాటు వల్ల సంభవిస్తుంది. ఈ దోమకాటు బారిన ఒక్కసారి పడితే జ్వరంతోపాటు.. తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, దద్దుర్లు చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరిలోనైతే గందరగోళం, అలసట, మూర్చ ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.


Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!  


Also Read: Vaikunta Ekadasi 2023: వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 


Ointment For Pileshome Remedies For PilesPiles Operation Cost