Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!

India Vs Bangladesh 2nd Odi Playing 11: బంగ్లాదేశ్‌తో నేడు కీలక మ్యాచ్‌కు భారత్ రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు వన్డే సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. భారత తుది జట్టులో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2022, 06:58 AM IST
  • భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే
  • మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు 1-0 ఆధిక్యం
  • ఈ మ్యాచ్‌ గెలిస్తే బంగ్లాదే సిరీస్
  • టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు
Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!

India Vs Bangladesh 2nd Odi Playing 11: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమవుతోంది. తొలి వన్డేలో అనూహ్యంగా ఒక వికెట్ తేడాతో ఓడిపోయిన భారత్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవోగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ చూస్తుండగా.. మరోసారి టీమిండియాకు ఝలక్ ఇచ్చి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లా జట్టు చూస్తోంది. బుధవారం మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తుది జట్టులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేస్తాడా..? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కెప్టెన్ రోహిత్ శర్మకు తోడు శిఖర్ ధావన్‌ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో ఈ జోడి ఫ్లాప్ అయినా.. ఒక్కసారి ఈ ద్వయం క్రీజ్‌లో కుదుకుంటే భారత్‌కు తిరుగుండదు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ కూడా తొలి వన్డేలో విఫలమయ్యాడు. రెండో వన్డేలో కోహ్లీపై అభిమానులకు భారీ ఆశలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో 43 సెంచరీలు చేసిన కింగ్ కోహ్లీ బ్యాట్‌ నుంచి మరో శతకం కోసం ఎదురుచూస్తున్నారు.  

ఇటీవల న్యూజిలాండ్ టూర్‌లో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మరోసారి వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించవచ్చు. తొలి వన్డేలో రాహుల్ 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ మొదటి మ్యాచ్‌లో విఫలమవ్వడంతో అతని స్థానంలో అక్షర్ పటేల్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్‌కు ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

తొలివన్డేలో బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తిసినా.. భారత బౌలర్లు మాత్రం ఆకట్టుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బాగా ప్రయత్నించారు.  మహ్మద్ సిరాజ్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నాడు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అరంగేట్ర వన్డేలో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్న కుల్దీప్ సేన్‌కు మరో అవకాశం ఇస్తారా..? లేదా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌లో తీసుకువస్తారానేది చూడాలి. 
 
రెండో వన్డే కోసం భారత్ జట్టు (అంచనా): 

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కుల్దీప్ సేన్/ఉమ్రాన్ మాలిక్. 

Also Read: Vaikunta Ekadasi 2023: వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

Also Read: మళ్లీ రిస్క్ చేస్తున్న నాగ్.. కత్తి లాంటి రైటర్ కు డైరెక్టర్ ఛాన్స్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News