Milk Side Effects: పాలతో కలిపి ఈ పదార్థాలను తీసుకుంటే మీ పని అంతే ఇక.. ఎందుకో తెలుసుకోండి. ప్రతి రోజు గ్లాసు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. పాలలో అనేక పోషకాలుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి నేపధ్యంలో అందరి దృష్టి ఇప్పుడు బలవర్ధకమైన ఆహారంపై పడింది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ( Immunity)పెంపొందించుకునేందుకు కావల్సిన ఆహార పదార్ధాల్ని సాధ్యమైనంత ఎక్కువగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పాలు చాలా కీలకంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే పాలలో ఉండే పోషక పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి. రోజూ క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం ఇందుకు దోహదపడుతుంది. అయితే పాలతో పాటు కొన్ని రకాల పదార్ధాలు కలిపి తీసుకోవడం నిషేధం. ఎందుకంటే మేలు కాదు కదా..హాని చేకూరుస్తాయి. ఆరోగ్యంపై దుష్ఫ్రభావం పడుతుంది. ఆ ఆహార పదార్ధాలేంటనేది పరిశీలిద్దాం.


పాలు లేదా పెరుగుతో చేపలు అస్సలు (Food Items along with Milk) తినకూడదు. ఇలా చేస్తే అజీర్తి సమస్య ఎదురవుతుంది. అటు పాలతో చికెన్ కూడా తీసుకోకూడదు. చికెన్, పాలు కలిపి తీసుకోవడం వలన..గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు మినపప్పు పదార్ధాలు కూడా పాలతో తీసుకోకూడదు. మినుములో ఉండే పోషక పదార్ధాలు పాలతో కలిస్తే..వాంతులు, కడుపు బరువెక్కడం వంటి సమస్యలు ఎదురవుతాయి.


ఇక మరో ముఖ్యమైంది పాలతో సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ద్రాక్ష, నిమ్మకాయలు, ఆరెంజ్ వంటి పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పాలతో పాటు తీసుకోకూడదు. లేకపోతే కడుపు నొప్పి వంటి సమస్య ఎదురవుతుంది. పాలు, పెరుగు తీసుకున్న రెండు గంటల తరువాత నువ్వులు, ఉప్పు పదార్ధాల్ని తీసుకుంటే మంచిది. అలాగని కలిపి ఒకేసారి తీసుకోకూడదు. అదే సమయంలో పనస, కాకరకాయల్ని కూడా పాలతో (Milk) కలిపి తీసుకోకూడదు. దీనివల్ల దురద, సోరియాసిస్ వంటి సమస్య ఎదురవుతుంది. 


Also read: Omicron Variant: ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి తెలుస్తుందా లేదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook