Jamun fruit.. సీజనల్ గా లభించే పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి.. రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు.. ముఖ్యంగా నేరేడు పండులో  ప్రోటీన్, కొవ్వు, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్ , విటమిన్ బి,  యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లేవిన్ , నియాసిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి.. పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.. కాబట్టి వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారనే సమస్య ఉండదు. ఇక జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బరువు తగ్గడంలో సహాయపడతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపోతే సాధారణంగా కొన్ని రకాల పండ్లను తిన్న తర్వాత మరికొన్ని రకాల పండ్లను లేదా ఆహార పదార్థాలను తినకూడదు అని.. అలా తింటే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  నేరేడు పండ్లు.. తిన్న తర్వాత కొన్ని రకాల పండ్లు తింటే మాత్రం నిజంగా అనారోగ్యానికి గురి కావాల్సిందే.. ఎందుకంటే వీటిని తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది.. కాబట్టి నేరేడు పండు తిన్న తర్వాత ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


నేరేడు పండు తిన్న తర్వాత పాలు.. ఎప్పుడు తాగకూడదు.. ఇలా చేస్తే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వస్తాయి.. నేరేడు పండు తిన్న తరువాత కనీసం అరగంట సమయం ఆగాలి. ఆ తర్వాత పాలు తాగవచ్చు.. లేకపోతే గ్యాస్,  కడుపునొప్పి,  మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. 


అలాగే నేరేడు పండు తిన్న తర్వాత ఊరగాయ తినకూడదు. నిజానికి ఊరగాయలలో నూనె,  మసాలాలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి నేరేడు పండు తిన్న తరువాత వెంటనే వీటిని తింటే మంచిది కాదు.. నేరేడు పండు తిన్న వెంటనే ఊరగాయలు తింటే గ్యాస్ సంబంధిత సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


అలాగే నేరేడు పండు తిన్న తర్వాత పసుపు తీసుకోవడం హానికరం. అలాగే పసుపు కలిపిన ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.. అనేరేడు పండు తిన్న తర్వాత పసుపు లేదా పసుపు వేసిన ఆహారాలను తింటే కడుపులో మంట , వికారం  కలిగే అవకాశం ఉంది .. కాబట్టి నేరేడు పండు తిన్న తర్వాత వీటిని తినకూడదు.. ఒకవేళ తినాలనుకుంటే సుమారుగా అరగంట నుండి గంట సమయం ఆగి ఆ తర్వాత తింటే మంచిది. ఇకపోతే నేరేడు పండు వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ.. తిన్న వెంటనే ఇప్పుడు చెప్పిన ఈ ఆహార పదార్థాలను తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.


Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.