Tulsi Water Remedies: మధుమేహం నియంత్రణకు అద్భుత ఔషధం తులసి నీళ్లే, ఆయుర్వేదం ఏం చెబుతోంది
Tulsi Water Remedies: ఆయుర్వేదంలో, హిందూ ఆధ్యాత్మికతలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఆకులు, గింజలతో అద్భుత ప్రయోజనాలున్నాయి. తులసి ఆకుల నీళ్లతో మధుమేహాన్ని సైతం నియంత్రించవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
Tulsi Water Remedies: ఆయుర్వేదంలో, హిందూ ఆధ్యాత్మికతలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఆకులు, గింజలతో అద్భుత ప్రయోజనాలున్నాయి. తులసి ఆకుల నీళ్లతో మధుమేహాన్ని సైతం నియంత్రించవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో మధుమేహం అనేది పెనుసవాలు విసురుతున్న సమస్యగా మారుతోంది. మధుమేహం నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎందుకంటే బ్లడ్ షుగర్ అనేది చాలా ప్రమాదకరం. బ్లడ్ షుగర్ స్థాయి పెరిగేకొద్దీ డయాబెటిక్ పేషెంట్‌గా మారిపోతారు. అయితే ఆయుర్వేదంలో మధుమేహానికి మంచి ప్రత్యామ్నాయం ఉందంటున్నారు వైద్యులు. సరైన ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలితో చాలావరకూ రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే..బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించవచ్చు. అయితే తులసి నీళ్లతో బ్లడ్ షుగర్ తగ్గించుకోవచ్చని చాలా తక్కువ మందికి తెలుసు. తులసి ఆకుల నీళ్లను మధుమేహం తగ్గించేందుకు ఎలా వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం నియంత్రణలో తులసి నీరు
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే..ముఖ్యంగా కావల్సింది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఓ గ్లాసు నీళ్లలో తులసి ఆకులు కొన్ని వేసి ఉడికించాలి. ఆ తరువాత ఆ నీటిని వడపోసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో తులసి నీళ్లతో చాలా ప్రయోజనాలున్నాయి. తులసి నీళ్లు జలుబు, దగ్గు తగ్గించేందుకు అద్భుతమైన ఔషధంగా ఉపయోపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఆధునిక పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు తులసి ఆకులు గానీ, తులసి నీళ్లు గానీ మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. తులసి ఆకులతో టీ కూడా చేసుకుని తాగినా మంచి ఫలితాలుంటాయి.
Also read: Orange precautions: ఆరెంజ్ ఆరోగ్యానికి మంచిది కాదా, ఎవరు తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook