Bad Cholesterol Reduce 7 Days: అనారోగ్యకరమైన ఆహారాలే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలను పెంచుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త ప్రసరణ లో మార్పులు జరిగి అది గుండెపై ప్రభావం పడుతుంది. దీంతో గుండెపోటు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరిలో ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి దీనిపై జాగ్రత్త వహించి చెడు కొలెస్ట్రాల నుంచి ఉపశమనం పొందడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ నియంత్రణకు ఇలా చేయండి:
బీన్స్ తో కూడా కొలెస్ట్రాల్ ని నియంత్రించవచ్చు:

బీన్స్ లో శరీరం కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. 



వెనిగర్:
క్యాన్సర్ పై జరిపిన అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి రెబ్బలను వెనిగర్లో నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


బెండకాయలు:
బెండకాయల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే గుణాలుంటాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో భాగంగా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.


పచ్చి క్యాబేజీ:
పచ్చి క్యాబేజీలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. పొట్ట సమస్యలను సులభంగా తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.


Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు 


Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook