Banana Tea: బనానా టీని తాగడం వల్ల ఈ సమస్యలు మాయం!
Banana Tea Benefits: టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. దీనికి బదులుగా బనానా టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Banana Tea Benefits: రోజూ టీ, కాఫీలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య బారిన పడాల్సి వుంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా అరటి పండుతో తయారు చేసిన టీ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ,ఈ టీ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నలో నీళ్లను పోసి మరిగించాలి. ఒక అరటి పండును తీసుకుని కట్ చేయాలి. మరుగుతున్న నీటిలో అలాగే పండలను వేసుకోవాలి. స్టవ్‌ను సిమ్‌లో పెట్టి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత దీనిని వడకట్టాలి. అందులో దాల్చిన చెక్క పొడి, తేనెను కూడా కలుపుకోవచ్చు. దీంతో అరటి పండు టీ రెడీ అవుతుంది.
దీని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలను పొందవచ్చు. అరటి పండు టీని తాగడం వల్ల షుగర్ సమస్య తగ్గుతుంది. దీని వల్ల బరువు తగ్గుతుంది. అరటి పండు టీలో ట్రిప్టోఫాన్, సెరటోనిన్, డోపమైన్ అనే మజిల్ రిలాక్సంట్స్ ఉంటాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
ఈ టీ వల్ల నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అరటి పండు టీని తప్పనిసరిగా రోజూ తాగాల్సి ఉంటుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదని ఆరోగ్యనిపుణు చెబుతున్నారు.
Also read: Strong Bones: వయస్సుతో పాటు ఎముకలు పటుత్వం కోల్పోతున్నాయా, ఇలా చేయండి చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook