Beetroot Benefits: కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అందులో ముఖ్యంగా బీట్‌ రూట్‌ తీసుకోవడం వల్ల మరి ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్‌, ఇతర పోషకాలు ఉంటాయి. అయితే బీట్‌ రూట్‌ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీట్‌ రూట్‌ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు:


గర్భిణీలు స్త్రీలు  బీట్‌ రూట్‌ తీసుకోవడం చాలా అవసరం. ఇందులో ఉండే ఫొలేట్‌, విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీని వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే బీట్‌రూట్‌ ఉండే బెటానిన్‌ ఆ కొవ్వును తగ్గిస్తుంది. ఇది బరువు ఎక్కువగా ఉన్నవారు, బెల్లీ ఫ్యాట్‌ ఉన్నవారు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. 


రక్తపోటు అదుపు చేయడంలో కూడా బీట్‌ రూట్ జ్యూస్‌ సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించే నైట్రేట్‌ పోషకం ఉంటుంది. హైపర్‌ టెన్షన్‌తో ఇబ్బంది పడేవారు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా బీట్‌రూట్‌ జ్యూస్‌లో ఉండే ఫ్రీరాడికల్స్‌, బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. బీట్‌ రూట్‌ జ్యూస్‌ లివర్ పై కొవ్వు పేరుకో పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇందులోని పోటాషియం అధికంగా ఉంటుంది దీని వల్ల నరాలు, కండరాల సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. అలాగే చర్మ రక్షణలో కూడా ఏంతో దోహదపడుతుంది. 


కావలసినవి:


2 పెద్ద బీట్‌రూట్‌లు, తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి
1 ఆపిల్, తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి
1/2 క్యారెట్, తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి
1/2 అంగుళం అల్లం ముక్క
1/2 నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ తేనె
1 గ్లాసు నీరు


తయారీ విధానం:


ఒక జ్యూసర్‌లో బీట్‌రూట్‌, ఆపిల్, క్యారెట్, అల్లం ముక్కలు వేసి బాగా జ్యూస్ చేయండి.
జ్యూస్‌లో నిమ్మరసం, తేనె (మీరు ఉపయోగించాలనుకుంటే) కలపండి.
ఒక గ్లాసులో పోసి వెంటనే తాగండి.


చిట్కాలు:


మీరు మరింత రుచి కోసం జ్యూస్‌లో కొంచెం పుదీనా ఆకులు లేదా నిమ్మకాయ ముక్కలు కూడా చేర్చవచ్చు.
బీట్‌రూట్‌ జ్యూస్ చాలా గాఢంగా ఉంటుంది, కాబట్టి మీరు దానిని నీటితో కరిగించుకోవాలనుకోవచ్చు.
బీట్‌రూట్‌ జ్యూస్ చాలా రోజులు నిల్వ ఉండదు, కాబట్టి తాజాగా తయారు చేసి తాగడం మంచిది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి