Belly Fat Loss In 5 Days: ప్రస్తుతం చాలా మందిలో పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అయితే పొట్ట చుట్టు పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గించి ఫిట్‌గా ఉండేందుచుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో చాలా మంది తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో ఆహార నియమాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భోజనం చేసే క్రమంలో కూడా మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగడమేకాకుండా.. బరువు సులభంగా తగ్గుతారు. కాబట్టి ఎలాంటి ఆహారాలను ఏ సమయాల్లో తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పాహారం ఈ సమయంలో చేయాలి:
బరువు తగ్గడానికి అల్పాహారం తీసుకోవడానికి సరైన సమయం ఉదయం 7 గంటలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు అల్పాహారం తీసుకోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల హార్మోన్లు ప్రక్రియ సులభతరంగా మారుతుంది. కాబట్టి ఇలా ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.


భోజనం సమయం:
బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల డైట్‌లను అనుసరిస్తారు. అయితే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి మధ్యాహ్నం 12:30 నుంచి 1 మధ్య ఆహారాలన్ని తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆహారాన్ని తీసుకునే క్రమంలో తప్పకుండా పోషకాలున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.


రాత్రి భోజనం:
బరువు తగ్గడానికి చాలా మంది కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆహార నియమాలతో బరువును తగ్గించవచ్చని నిపుణులు నిపుణులు తెలుపుతున్నారు. అయితే భోజనం చేసే క్రమంలో తప్పకుండా సమయపాల పాటించడం చాలా ముఖ్యం. రాత్రి భోజనం చేసే క్రమంలో కేవలం  రాత్రి 6 నుంచి 7 గంటల మధ్యలోనే ఆహారాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!


Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి