Belly Fat Loss Tips: అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు అనేది ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. ఉరుకుల పరుగుల జీవితంలో ఏది పడితే అది తినడం, శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒక్కసారి బరువు పెరుగుతున్నట్లు మీకు అనిపించిందంటే వెంటనే డైట్‌పై ఫోకస్ చేయాలి. బరువు తగ్గేందుకు దోహదపడే ఫైబర్, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. త్వరగా బరువు తగ్గేందుకు దోహదపడే 5 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనగలు :


అధిక బరువుతో బాధపడేవారు నానబెట్టిన శనగలను రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శనగల్లో ఫైబర్, ప్రొటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 3 ఔన్సుల శనగలు తీసుకునేవారిలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. సగం కప్పు శనగల్లో 106 కేలరీలు, 5 గ్రాముల ఫైబర్, 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.


ఓట్స్


ఓట్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రోజుకు కప్పు లేదా కప్పున్నర ఓట్ మీల్ తీసుకోవడం కొలెస్ట్రాల్ 5 నుంచి 8 శాతం వరకు తగ్గుతుంది. ఓట్స్‌లో సాల్యుబుల్ అండ్ ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇవి రెండు శరీరానికి చాలా అవసరం. 


వాల్‌నట్స్ 


రోజుకు గుప్పెడు వాల్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. బాడీ వెయిట్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టెరోల్స్, విటమిన్స్ ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తాయి. తద్వారా తరచూ ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.


రాస్ప్‌బెర్రీ 


రాస్ప్‌బెర్రీ పండ్లలో రాస్ప్‌బెర్రీ కీటోన్ ఉంటుంది. ఒబేసిటీతో బాధపడేవారికి ఇది మంచి ఫలితాన్నిస్తుంది. ఇది మెటబాలిజాన్ని పెంచుతుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను తమ డైట్‌లో చేర్చుకుంటే బెటర్.


గుమ్మడి గింజలు 


గుమ్మడి గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా గుమ్మడి గింజలు తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె పదిలంగా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్‌కి కూడా ఇది చెక్ పెడుతుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు దోహదపడుతాయి.


Also Read: Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..


Also Read: Jharkhand : పనిమనిషికి బీజేపీ మహిళా నేత చిత్రహింసలు.. నాలుకతో టాయిలెట్ క్లీన్ చేయించిన వైనం..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook