Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..

Ganesh Chaturthi 2022 Ganesh Naivedyam Recipes: గణేశుడికి ఇష్టమైన నైవేద్యమేంటో తెలుసా.. ఏ పదార్థాలు ఆయనకు ప్రీతికరమైనవో తెలుసా...

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 31, 2022, 07:42 AM IST
  • బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలు
  • ఈ పదార్థాలు ఆయనకు ప్రీతికరమైనవి
  • వీటిని నైవేద్యంగా పెడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది
Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..

Ganesh Chaturthi 2022 Ganesh Naivedyam Recipes: ఇవాళ వినాయక చవితి. చిన్నాపెద్దలందరికీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి తిథిలో వినాయక చవితి పండగ జరుపకుంటారు. ఈసారి ఆగస్టు 31న గణేశ్ చతుర్థి వచ్చింది. నేటి నుంచి 9 లేదా 10 రోజుల పాటు ఆ బొజ్జ గణపయ్య పూజలు అందుకోనున్నాడు. గణనాథుడి పూజలంటే నైవేద్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి ఆ గణపయ్యకు ఇష్టమైన ఆహారం ఏది.. ఏ పదార్థాలను  నైవేద్యంగా సమర్పిస్తే ఆ భగవంతుడి కృప మీపై ఉంటుంది.. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం... 

కుడుములు..

కుడుములనే మోదక్ అని కూడా అంటారు. మోదక్ గణనాథుడికి చాలా ప్రీతికరమైన పదార్థం. అందుకే ఆయన్ను మోదప్రియ అని కూడా పిలుస్తారు. నెయ్యి, బెల్లం,యాలకులపొడి, బియ్యం పిండి, కొబ్బరి పొడితో కలిపి కుడుములు తయారుచేస్తారు. ఒకసారి ఒక భక్తుడు కైలాస పర్వతాన్ని సందర్శించినప్పుడు ఆ పార్వతీ మాతకు కుడుములను ప్రసాదంగా ఇస్తాడు. అప్పుడు పార్వతీ దేవి ఆ ప్రసాదాన్ని తన కుమారులైన గణేశుడికి,కుమారస్వామికి ఇచ్చి ఇద్దరు పంచుకోమని చెబుతుంది. 

అయితే ప్రసాదాన్ని పంచుకోవడానికి వారు ఆసక్తి చూపరు. దీంతో పార్వతీ దేవి వారికి ఒక పరీక్ష పెడుతుంది. ఇద్దరిలో ఎవరు ఈ ప్రపంచాన్ని వేగంగా చుట్టివస్తారో వారికే ఈ ప్రసాదం ఇస్తానని చెబుతుంది. కుమారస్వామి ముల్లోకాలను చుట్టేందుకు వెళ్లగా.. గణేశుడు మాత్రమే పార్వతి మాత చుట్టే మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తాడు. గణపయ్య భక్తికి ముగ్ధురాలైన పార్వతీ దేవి.. ఆ ప్రసాదాన్ని గణనాథుడికే ఇస్తుంది. అందుకే గణేశ్ చతుర్థి నాడు కుడుముల ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది.

మోతీచూర్ లడ్డూ :

గణనాథుడికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా లడ్డూ. అందుకే గణనాథుడి విగ్రహాలు, ప్రతిమల్లో ఆయన చేతిలో లడ్డూ తప్పనిసరిగా ఉంటుంది. లడ్డూలన్నింటిలో మోతీచూర్ లడ్డూ అంటే గణనాథుడికి మరింత ప్రీతికరం. అలాగే దూద్ పేడ కూడా గణనాథుడికి చాలా ఇష్టమైన పదార్థం. వీటిని నైవేద్యంగా సమర్పిస్తే ఆ గణనాథుడు ఇష్టంగా ఆరగిస్తాడు.

పేలాల ముద్దలు :

పేలాలు, బెల్లం కలిపి ముద్దగా చేసే ఈ తీపి పదార్థమంటే గణనాథుడికి ప్రత్యేక ఇష్టం. మోతీచూర్ లడ్డూ ఖరీదైనది కాబట్టి.. అలాంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించలేనివారు పేలాల ముద్దలు సమర్పించవచ్చు. ఒకసారి కుబేరుడు తన ఇంటికి వినాయకుడిని ఆహ్వానించినప్పుడు రకరకాల పదార్థాలతో భోజనం పెడుతాడు. అయినప్పటికీ ఆయన కడుపు నిండదు. అప్పుడు శివుడు పేలాల ముద్దలు పెట్టమని కుబేరుడితో చెబుతాడు. కుబేరుడు శివుడు చెప్పినట్లే చేస్తాడు. అవి తినగానే గణనాథుడి కడుపు నిండుతుంది. అందుకే గణనాథుడికి పేలాల ముద్దలు నైవేద్యంగా పెడుతారు.

అరటిపండ్లు : 

పండ్లన్నింటిలో అరటిపండ్లంటే గణనాథుడికి చాలా ఇష్టం. అరటిపండ్లు రుచికరమైనవి, పోషకాహారం కలిగినవి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండేందుకు అరటిపండ్లు బెస్ట్ ఛాయిస్. అందుకే గణనాథుడికి కూడా అరటిపండ్లంటే ఎక్కువ ఇష్టమని చెబుతారు. 

గరిక :

గణనాథుడి పూజలో గరికను సమర్పించడం కూడా చాలా ముఖ్యమైనది. హిందూ పురాణాల ప్రకారం గణనాథుడు ఒకసారి రాక్షసుడైన అనల్‌సురాను అమాంతం మింగేస్తాడు. అయితే అజీర్తి సమస్యతో బాధపడుతాడు. దీనికి కొంతమంది మహర్షులు గరికను పరిష్కారంగా సూచిస్తారు. అది తిన్న తర్వాత గణనాథుడు అజీర్తి నుంచి విముక్తమవుతాడు. అందుకే గణనాథుడికి గరిక కూడా సమర్పిస్తారు. దీన్నే దూర్వా అని కూడా పిలుస్తారు.

Also Read: Ganesh Chaturthi 2022: గణేశ్ చతుర్థి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా ? అశుభమా ?

Also Read: Horoscope Today August 31st 2022: వినాయక చవితి స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News