Belly Fat Reduce: ఇంట్లోనే ఈజీగా ఇలా బెల్లీ ఫ్యాట్‌ను 1 వారంలో నియంత్రించవచ్చు..
Belly Fat Reduce In 1 Week: కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలుసు.. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువును తగ్గించడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Belly Fat Reduce In 1 Week: కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలుసు.. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువును తగ్గించడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే బరువు తగ్గే క్రమంలో డైట్‌లో భాగంగా కొబ్బరి నీళ్లను వినియోగిస్తే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు నియంత్రణలో ఉండడానికి.. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి కొబ్బరికాయను ఎలా వినియోగించాలి:
1. తక్కువ కార్బ్ ఫుడ్స్‌ను తీసుకోవాలి:
ప్రస్తుతం చాలా మంది డైటీషియన్లు, పోషకాహార నిపుణులు బరువు తగ్గే క్రమంలో తక్కువ కార్బ్ ఆహారాన్ని తినాలని సూచిస్తూ ఉంటారు. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయని వారు చెబుతున్నారు. కొబ్బరిలో రోగ నిరోధక లక్షణాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా.. శరీరం దృఢంగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
2. ఆకలిని నియంత్రిస్తుంది:
కొబ్బరిలో ఆకలిని నియంత్రించే చాలా రకాల మూలకాలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. ముఖ్యంగా ఇందులో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. బరువు తగ్గే క్రమంలో ఆకలి సమస్యలతో బాధపడుతున్నవారు.. కొబ్బరితో చేసిన ఆహారాలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలపుతున్నారు. అంతేకాకుండా కొబ్బరిని స్మూతీగా కూడా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
3. జీవక్రియను మెరుగుపరుచుతుంది:
కొబ్బరిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుత పరుచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల జీవక్రియ రేటును వేగవంతంగా మారుతుంది. ముఖ్యంగా బరువు కూడా సులభంగా తగ్గుతారు.
4. బెల్లీ ఫ్యాట్:
కొబ్బరి నూనె ఆకలిని నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీవక్రియను పెంచుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook