నిత్యం ఎదుర్కొనే చాలారకాల అనారోగ్య సమస్యలకు మన చుట్టూ లభించే  పదార్ధాలు, వస్తువుల్లోనే పరిష్కారముంది. ముఖ్యంగా జీవనశైలి కారణంగా తలెత్తే బెల్లీ ప్యాట్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆ ప్రత్యేకమైన టీ అద్భుతంగా పనిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్. అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఓ ప్రత్యేకమైన టీతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ గురించి ఇప్పటి వరకూ విని ఉంటారు. కానీ ఈ స్పెషల్ టీ గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఇది మీ శరీరంలో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. 


ప్రస్తుతం ఎక్కడ చూసినా..చెడు ఆహారపు అలవాట్ల కారణంగా యువత ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. రకరకాల వ్యాధులకు గురవుతుంటారు. శరీరంలో ఆకస్మాత్తుగా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె వ్యాధులు, రక్తపోటు ముప్పు పొంచి ఉంటుంది. మీ డైట్‌లో ఈ స్పెషల్ టీ చేర్చితే..ఈ సమస్యల్నించి విముక్తి పొందడమే కాకుండా..బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.


ఆ స్పెషల్ టీ ఏమిటి


1. ఈ టీ గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఇదేమీ గ్రీన్ టీ, బ్లాక్ టీ కానేకాదు. ఇది వైట్ టీ. ఇతర సాధారణ టీలతో పోలిస్తే వైట్ టీ లో ప్రోసెస్ తక్కువ. అదే సమయంలో ఇతర టీలతో పోలిస్తే..ఎక్కువ లాభదాయకం. గ్రీన్ టీ లానే వైట్ టీ కూడా శరీరంలో పెరుగుతున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులో యాంటీ కేన్సర్ గుణాలున్నాయి.


2. ఇది హైబిస్కస్ టీ. సాధారణ టీతో పోలిస్తే చాలా ప్రయోజనాలున్నాయి. హైబిస్కస్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శరీరంలో పెరుగుతున్న బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ 2-3 సార్లు హైబిస్కస్ టీ తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.


3. రెడ్ టీ అనేది మరో విభిన్నమైంది. దక్షిణాఫ్రికాలో తయారౌతుంది. రెడ్ టీ తయారు చేయాలంటే..ఓ ప్రత్యేకమైన ఫర్మెంటెడ్ హెర్బ్ రోయిబాస్ వినియోగిస్తారు. రెడ్ టీలో యాంటీ కేన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తాగితే కేన్సర్ ముప్పు తగ్గిపోతుంది.


Also read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook