Amla benefits: ఆమ్లా అదేనండి మన ఉసిరికాయ.. పచ్చగా గుండ్రంగా ఉండే ఈ ఉసిరిగా తినడానికి పుల్లగా ఉంటుంది. ఎక్కువగా మనం దీన్ని పచ్చడిగానో, ఆవకాయ గాను చూస్తాం తప్ప దీంతో జ్యూస్ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఉసిరికలో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది.. అందుకే ఇది మనకు ఇమ్యూనిటీని ఇవ్వడంలో సహాయపడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉసిరికాయను శీతాకాలం సూపర్ ఫుడ్ గా కూడా చెప్పవచ్చు. ఇందులో ఉన్న అనేక రకమైన పోషక విలువలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు ప్రేగులను శుభ్రపరిచి ,ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరిచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ఉసిరి సహాయపడుతుంది. అయితే దీన్ని నేరుగా తినడం చాలా కష్టం. ఒకవేళ తిన్న కాస్త రుచి చూడగలమే తప్ప అదేపనిగా తినలేము కదా.


అందుకే ఉసిరికాయలో ఉన్న సుగుణాలు మొత్తం మన శరీరానికి అందే విధంగా మనం తీసుకునే రెగ్యులర్ జ్యూసెస్ లో ఒక ఉసిరికాయని కలుపుకోవడం అలవాటు చేసుకోవాలి. జ్యూస్ , స్మూతీ ఇలా ఏదైనా సరే చేసేటప్పుడు ఒక ఉసిరికాయని కూడా కట్ చేసి మిక్సీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రోజు ఉసిరిక తినడం వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా ద్విగినీకృతం అవుతుంది. ఉసిరికలో ఉన్న సుగుణాలు మన జుట్టుని చిక్కగా ఒత్తుగా చేయడమే కాకుండా స్మూత్ గా కూడ ఉంచుతాయి.


నాటు వైద్యంలో కూడా ఉసిరికాయని ఎక్కువగా వాడుతుంటారు. చలికాలంలో ఉసిరికాయను రోజు సేవించడం వల్ల ఫ్లూ ,ఇన్ఫెక్షన్స్ జలుబు వంటివి అస్సలు మన దరిదాపుల్లో కూడా రావు. ఉసిరికాయలు విటమిన్ బి 5, బి 6,, రాగి ,పొటాషియం, మేంగనీస్ వంటి ఎన్నో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. జ్యూస్ రూపంలో కూడా ఉసిరికాయని తీసుకోలేని వారు ఉసిరికాయలను తేనెలో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న పర్లేదు కానీ ఈ శీతాకాలం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మీ కుటుంబం దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలి అంటే ఉసిరికాయని మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకోండి.


గమనిక: పై సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది .ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook