Coffew and Tea: కాఫీ, టీలలో ఏది మంచిది..ఏది కాదు, రోజుకు ఎన్ని కప్పులు
Coffew and Tea: దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన టీ, కాఫీల గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. అసలు టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఏ మేరకు మంచిది, ఎలా తాగాలనే అంశంపై చాలా విషయాలు తెలుసుకోవల్సి ఉంది. అవేంటో చూద్దాం.
Coffew and Tea: దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన టీ, కాఫీల గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. అసలు టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఏ మేరకు మంచిది, ఎలా తాగాలనే అంశంపై చాలా విషయాలు తెలుసుకోవల్సి ఉంది. అవేంటో చూద్దాం.
టీ, కాఫీ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కొకక అలవాటు. కొంతమంది టీ, కాఫీలు అమితంగా తీసుకుంటుంటే..మరి కొంతమంది రోజుకు 1-2 సార్లు మాత్రమే తీసుకుంటారు. ఏదైనా సరే పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకూ టీ , కాఫీ అనేది సర్వ సాధారణమే. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఓ కప్పు కాఫీ తాగితే..జ్ఞాపకశక్తి పెరగుతుంది. నడుం కూడా సన్నబడుతుంది. రోజుకు 2-3 కప్పులు మాత్రమే కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటారు. ఇవి తాగడం ద్వారా మెదడులోని రసాయనిక మార్పులకు కారణమై..ఉత్సాహం, చురుకుదనం వస్తుంది. ఇందులో ఉండే కేలరీలతో శక్తి వస్తుంది. పని ఒత్తిడి, తీవ్ర అలసట ఉన్నప్పుడు టీ (Tea), కాఫీ తీసుకోవడం ద్వారా శరీరం ఉత్తేజితమవుతుంది. ఎందుకంటే మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్ అడినోసిస్‌ను బ్లాక్ చేయడంలో టీ, కాఫీలు దోహదపడతాయి. నిద్రమత్తు కూడా అందుకే పోతుంది. కెఫిన్ మంచిదే అయినా..పరగడుపున మాత్రం మంచిది కాదంటున్నారు వైద్యులు.
టీ, కాఫీల్లో ఏది మంచిది , ఏది కాదనే చర్చ కూడా ఉంది. ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం కాఫీ (Coffee) కంటే టీ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే టీ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే టీలో చక్కెర, పాలు తగ్గించుకుని తాగాల్సి ఉంటుంది. రోజూ టీ తీసుకునేవారిలో ఎముకలు బలంగా ఉంటాయిట. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు టీ తాగితే..పూర్తిగా ఫ్రెష్ అయిపోతారు.టీ తాగడం వల్ల శరీరానికి ఉత్సాహం, ఉత్తేజం వస్తాయి. ఇక బ్లాక్ టీతో అయితే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరుగుతుంది. ఆకలి మందగిస్తుంది.
ఇక కాఫీ గురించి మరో ఆసక్తికరమైన అంశముంది. రాత్రి పూట భోజనం కొద్దిగా తీసుకుని ఓ కప్పు కాఫీ తాగితే..జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతారు. అంతేకాకుండా..నడుం కూడా సన్నబడుతుందట. అయితే అలాగని అదే పనిగా తాగకూడదు. రోజుకు 2-3 కప్పులు మాత్రమే. ఇక గుండె జబ్బులు, కేన్సర్(Cancer)వంటి వ్యాధులున్నవారు సాధ్యమైనంతవరకూ కాఫీనే తాగాలనేది వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఏదైనా సరే మోతాదులోనే తీసుకోవాలి. ఎందుకంటే టీ అయినా, కాఫీ అయినా సరే మోతాదు మించితే అనర్దాలే కలుగుతాయి. కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ అయితేనే మంచిది.
Also read: Kada as Immunity Booster: కాడాలో కొద్దిగా మిరియాలు కలుపుకుని తాగితే చాలు..అద్భుతమైన ఇమ్యూనిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook