Kada as Immunity Booster: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలో వచ్చింది కాడా. అంటే ఓ రకమైన కషాయం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో దీన్ని మించింది లేదు. ఈ కాడాకు నల్ల మిరియాలు జోడిస్తే..
కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కావల్సిందే ఒక్కటే. అదే రోగ నిరోధక శక్తి. అనాదిగా భారతదేశంలో కషాయం తాగడం అలవాటు. దాన్నే కాడాగా పిలుస్తారు కూడా. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కాడా అద్భుతంగా పనిచేస్తుంది. కాడాలో నల్ల మిరియాల పౌడర్ కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒమిక్రాన్ నుంచి కూడా రక్షణ పొందవచ్చంటున్నారు నిపుణులు.
సహజంగా శీతాకాలంలో మనిషి శరీరం బలహీనమై..ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వంటివి సులభంగా దాడి చేయడానికి ఆస్కారమవుతుంది. అందుకే డైట్ ప్లాన్‌లో ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలు జోడించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన పదార్ధాల్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోగ నిరోధకత కోసం ప్రజలు ఎక్కువగా ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది కాడా. బ్లాక్ పెప్పర్‌ను (Black Pepper) ఇందులో జోడించి తీసుకుంటే చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
ఇమ్యూనిటీని (Immunity)పెంచడంలో ఆయుర్వేదం ఓ మంచి ప్రత్యామ్నాయంగా ఉంది. అందుకే ప్రజలు కూడా ఎక్కువగా ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆచరిస్తున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ పరిచయమైన పేరు కాడా అంటే కషాయం. ఇందులో అన్ని రకాల గరం మసాలా దినుసులుంటాయి. వీటి వల్ల మనిషి శరీరంలో వేడి పుట్టడమే కాకుండా రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఈ కాడాలో బ్లాక్ పెప్పర్ జోడిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఒమిక్రాన్ వంటి వేరియంట్ల నుంచి రక్షణ చేకూరుస్తుంది. బ్లాక్ పెప్పర్ అనేది ఆర్థరైటిస్, స్కిన్ డిసీజెస్లోనే కాకుండా బ్లడ్ గ్లూకోజ్ స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిని సమంగా ఉంచడంలో దోహదపడుతుంది.
బ్లాక్ పెప్పర్‌ను కాడాతోనే (Black pepper with Kada)కాకుండా టీ, కాఫీ లేదా వేడి పదార్ధాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. కొంతమందైతే స్వీట్స్‌పై కూడా బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా కలిపి తీసుకుంటారు. అన్ని రకాల వంటల్లో ఫ్లేవర్ కోసం కూడా కలుపుతుంటారు. ఎలా ఏ రూపంలో తీసుకున్నా సరే..బ్లాక్ పెప్పర్ ఓ మంచి ఔషధంగా ఉంటుంది.
Also read: Garlic and Beetroot Benefits: వెల్లుల్లి, బీట్రూట్ రోజూ తీసుకుంటే ఆ ప్రమాదం లేనట్టే ఇక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook