Benefits Of Coriander Leaves: కొత్తిమీర ఆహారాల రుచిని రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి భారతీయుడు ఆహారాల్లో తప్పకుండా కొత్తిమీరను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇది ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి కూడా చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ఆయుర్వేద నిపుణులు ఔషధంగా భావిస్తారు. ఈ కొత్తిమీర ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి ప్రతి రోజు కొత్తిమీరతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్తమీరతో తయారు చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఆ లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది:
పచ్చి కొత్తిమీర మధుమేహాన్ని నియంత్రించేందుకు దివ్యౌషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో రక్తంలో ఇన్సులిన్ మొత్తాన్ని నియంత్రించే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి కొత్తిమీరతో తయారు చేసిన జ్యూస్‌ ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా కొత్తిమీర ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ప్యాంక్రియాస్ కణాలలో ఇన్సులిన్ ప్రవాహాన్ని పెంచుతాయి. 


జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి:
పచ్చి కొత్తిమీర తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా పొట్ట నొప్పులు కూడా తగ్గుతాయి. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కొత్తిమీర మిశ్రమాన్ని అరగ్లాసు నీటిలో కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
కొత్తిమీర ఆకులను ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొత్తిమీర ఆకుల ఇథనాల్ మూలకాలు, ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థను మెరుగుపడుతుంది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


రక్తహీనత సమస్యలు:
ప్రస్తుతం చాలా మంది ఐరన్‌ లోపం కారణంగా రక్తహీనత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కొత్తమీరను తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు రక్తహీనత సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణుఎలు తెలుపుతున్నారు. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా క్యాన్సర్‌ వంటి సమస్యలు దూరమవుతాయి.


బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకునేవారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఎలాంటి సమస్యలు లేకుండా సులభంగా బరువు తగ్గించేందుకు కొత్తిమీర ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కొత్తిమీర గింజలను నీటిలో బాగా ఉడకబెట్టి..కషాయం చేసుకుని తాగడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణలు తెలుపుతున్నారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి