Health Benefits Of Honey: పాలలో తేనె కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు
తేనెను ఏ విధంగా సేవించినా.. ప్రయోజనాలే. ఎన్నో ఔషధాలు ఉన్న తేనెను క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల శరీరానికి లాభాలు తప్ప నష్టాలు అస్సలు ఉండవు.
Benefits of Honey with Hot Milk: న్యూఢిల్లీ: తేనెను ఏ విధంగా సేవించినా.. ప్రయోజనాలే. ఎన్నో ఔషధాలు ఉన్న తేనెను క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల శరీరానికి లాభాలు తప్ప నష్టాలు ఉండవు. తేనెలో ఫ్రూట్ గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. తేనె ( Honey ) లో యాంటిసెప్టిక్, యాంటీబయాటెక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె సేవించడం ద్వారా కంటి చూపు పెరుగుతుంది.. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న తేనెను వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. Also read: Health Tips: గొంతు నొప్పికి ఇలా చెక్ పెట్టండి
వేడి పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు నాడీ కణాల సమస్యలుంటే.. అవి దూరమై.. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది.
మంచిగా నిద్రపోవడానికి వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి.
జీర్ణక్రియను మెరుగుపడటానికి వేడి పాలలో క్రమం తప్పకుండా తేనె కలుపుకోని సేవించాలి. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
ఎముకలు బలంగా తయారుకావడానికి వేడి పాలలో తేనె కలుపుకోని తాగితే ప్రయోజనం. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు దూరమవుతాయి.
పాలలో తేనెను కలిపి క్రమం తప్పకుండా తాగడం వల్ల శారీరక.. మానసిక మానసిక సమస్యలు దూరమై రోగనిరోధక శక్తి, ఆరోగ్య సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు