Benefits of Raw Mangoes in Summer: ముఖ్యంగా మామిడికాయలు ఎండాకాలం వస్తాయి ఇవి సీజనల్ ఫ్రూట్స్. పచ్చి మామిడికాయలు ఆహారం చేర్చుకోవడం వల్ల అది ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.  సాధారణంగా మనం మామిడి పండ్లను తింటారు తీయగా ఉంటాయి కానీ పచ్చి మామిడికాయలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ సి..
పచ్చి మామిడికాయలు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌజ్ దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎండాకాలం పచ్చిమామిడికాయలు తినడం వల్ల చర్మం కూడా మెరుస్తుంది.


జీర్ణ ఆరోగ్యం..
పచ్చి మామిడికాయలను ఆరోగ్యంలో చేర్చుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కడుపులో అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. ఎండాకాలం వీటిని తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతుంది.


హైడ్రేటింగ్..
మామిడికాయలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది దీంతో ఎండాకాలం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటారు. చెమట రూపంలో ఎండాకాలం నీరు బయటకు పోతుంది ఈ సమయంలో మామిడి కాయలు తినడం మేలు.


శరీర ఉష్ణోగ్రత..
పచ్చిమామిడికాయల్లో చల్లని గుణాలు ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయి. మామిడికాయ తీసుకోవడం వల్ల కడుపు కూడా చల్లగా ఉంటుంది. వేడిమి నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. పచ్చి మామిడికాయలు తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి చల్లగా ఉంటుంది ఎండాకాలంలో కచ్చితంగా ఈ డైట్లో చేర్చుకోండి


ఇమ్యూనిటీ..
మామిడికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటమే కాకుండా ఇందులో విటమిన్ ఏ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరీటిన్, కేర్సోటింగ్ ఉంటాయి ఎండాకాలం మామిడికాయలు తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. దీంతో సీజనల్ ఇన్ఫెక్షన్ లో కూడా దూరంగా ఉండొచ్చు.


బరువు తగ్గుదల..
పచ్చి మామిడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది దీంతో బరువు పెరగకుండా ఉంటారు.


ఇదీ చదవండి:  చక్కెరకు బదులుగా ఈ 7 మీ డైట్లో చేర్చుకోండి.. ఏ రోగాలు రావు..


పంటి ఆరోగ్యం..
పచ్చి మామిడికాయలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పంటి సమస్యలకు చెక్ పెడతాయి. ఓరల్ డిసీజ్ రాకుండా మనల్ని కాపాడుతాయి. పచ్చి మామిడికాయ నేరుగా తినడం లేదా జ్యూస్ తాగటం వల్ల పంటి ఆరోగ్యానికి మంచిది.


ఎండ దెబ్బ..
పచ్చి మామిడికాయల్లో కూలింగ్ లక్షణాలు ఉంటాయి. తద్వారా ఎండ దెబ్బకు గురికాకుండా కాపాడుతుంది ఎండాకాలంలో పశ్చిమంగా జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది దీంట్లో తలనొప్పి, తలతిరుపుడు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు


ఇదీ చదవండి: డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ 5 జబ్బులు కూడా ప్రాణాంతకం..


గుండె ఆరోగ్యం..
పచ్చి మామిడికాయలలో పొటాషియం అవసరమైన మినరల్స్ ఉంటాయి ఇవి బీపీని నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది పచ్చి ఆరోగ్య పచ్చి మామిడికాయలను ఎండాకాలం డైట్లో చేర్చుకోవడం వల్ల బీపీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఇంత గుండె ఆరోగ్యంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook