Turmeric Milk: రోజూ పసుపుపాలు తాగుతున్నారా...అయితే కరోనా దరి చేరదిక
Turmeric Milk: ప్రతి రోజూ పాలు తాగితే మంచిదని తెలుసు మనకు. అదే పాలకు కాస్త పసుపు జోడించి చూడండి. ఎన్నెన్ని అద్భుతాలు లభిస్తాయో..చూడండి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో పసుపు పాలు ఎలా సహాయపడనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Turmeric Milk: ప్రతి రోజూ పాలు తాగితే మంచిదని తెలుసు మనకు. అదే పాలకు కాస్త పసుపు జోడించి చూడండి. ఎన్నెన్ని అద్భుతాలు లభిస్తాయో..చూడండి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో పసుపు పాలు ఎలా సహాయపడనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా వైరస్ ( Corona virus) ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ బలవర్ధకమైన ఆహారం ( Healthy food)పై శ్రద్ద ఎక్కువైంది. పాతకాలం నాటి ఆహారపదార్ధాలు, పానీయాన్ని తిరిగి అలవర్చుకుంటున్నాం. కారణం రోగ నిరోధక శక్తి ( Immunity power)పెంచుకోవాలనే ఆలోచన. ఈ క్రమంలో మరోసారి వెలుగులోకి వచ్చింది పసుపు పాలు. ఆ పసుపు పాలతో కలిగే ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం.
రోజూ పాలు తాగే అలవాటనేది అందరికీ ఉంటుంది కదా. దానికి కాస్త పసుపు కలిపి తాగండి. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక పదార్ధాలు మస్తిష్కాన్ని చురుగ్గా ఉంచుతాయి. పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు మూడు గ్లాసుల పాలు తాగేవారు చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉంటారనేది పరిశోధనలు చెబుతున్న మాట. ప్రతిరోజూ పసుపు పాలు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు ఓ బలమైన యాంటీ బయోటిక్‌గా పనిచేయడం వల్ల చాలా రుగ్మతల్నించి, ఇన్‌ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండవచ్చు.
ఈ పాలకు పసుపు తోడైతే అదనపు ప్రయోజనాలు కచ్చితంగా లభిస్తాయి. ఇది పాతకాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు పసుపు పాలను (Turmeric milk) తాగడం వల్లనే ఆరోగ్యంగా..ధృడంగా ఉండేవారు. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడేవారు పసుపు పాలను తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చాలామందికి కఫం పెద్ద సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. వెచ్చని పసుపు పాలను తీసుకుంటే కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో సెరిటోనిన్ ( Serotonin) అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దాంతో నిద్ర హాయిగా పడుతుంది.
పసుపుపాలతో ఇతర ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ దాడి నుంచి కాలేయాన్ని( liver ) రక్షిస్తుంది. రోజూ పసుపుపాలు సేవిస్తే.. కాలేయ సంబంధమైన పచ్చ కామెర్లు వంటివి రావు. కాలేయంలో చేరే విష కారకాలను హరిస్తుంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండా తాగాలి. వీటిలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్ ( Lymphatic system ) ను శుభ్రపరుస్తాయి. మరోవైపు పసుపులో ఉండే కర్‌క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది. నీళ్ల ద్వారా మన శరీరంలోకి చేరుకునే వైరస్..త్వరగా రెట్టింపవకుండా నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, బాడీ పెయిన్స్ తగ్గుతాయి.
Also read: COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook