Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే
Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Snacks for Diabetes: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి కారణంగా డయాబెటిస్ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిస్ సోకినప్పుడు ఆహారపు అలవాట్ల విషయంలో, జీవనశైలి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీ ఫుడ్, హెల్తీ స్నాక్స్ అనేవి ఉండాలి. ఆహారపు అలవాట్ల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు.
డయాబెటిస్ రోగులు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 30-40 నిమిషాలు శారీరక శ్రమ ఉండాలి. దాంతో పాటు ఎలాంటి ఆహారం తింటున్నామనేది పరిశీలించుకోవాలి. సెలెక్టివ్ ఫుడ్స్ మాత్రమే తినాలి. లేకపోతే బ్లడ్ షుగ్ర లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. డయాబెటిస్ రోగులు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో స్నాక్స్ తప్పకుండా తినాలి. అయితే ఈ స్నాక్స్ పూర్తిగా హెల్తీగా ఉండాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.
గుడ్లు ప్రోటీన్లకు బెస్ట్ సోర్స్. కేవలం డయాబెటిస్ రోగులకే కాదు..అందరికీ ఇది మంచిది. అందుకే చాలామంది బరువు తగ్గించేందుకు గుడ్లు తీసుకుంటారు. డయాబెటిస్ డైట్‌లో గుడ్లు కూడా భాగమే. బ్రేక్ ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో ఉడకబెట్టిన గుడ్డు తింటే చాలా మంచిది. శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.
డయాబెటిస్ రోగులకు మరో బెస్ట్ స్నాక్ పాప్‌కార్న్. ఇదొక టేస్టీ బ్రేక్ ఫాస్ట్. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో బరువు నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే పాప్‌కార్న్ బయట లభించేది కాకుండా ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది. బయట లభించే పాప్‌కార్న్‌లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇక బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ శెనగలు. బ్లాక్ గ్రామ్. మదుమేహం వ్యాధిగ్రస్థులకు ఇవి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్లతో పాటు ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. కొన్ని రకాల వెజిటబుల్ ముక్కలతో నిమ్మరసం పిండుకుని చాట్ రూపంలో తీసుకుంటారు. సాయంత్రం స్నాక్స్ సమయంలో బ్లాక్ గ్రామ్ తీసుకోవడం చాలా మంచిది.
ఇక ఈ మూడింటి కంటే బెస్ట్ బాదం. ఇందులో విటమిన్ ఇతో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్ నుంచి గుండె వ్యాధుల ముప్పు. డైట్‌లో బాదం చేర్చడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి. బాదం డైట్‌లో ఉండే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది.
Also read: Vitamin B6 Rich Foods: విటమిన్ బి6 లోపాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఈ 5 ఫుడ్స్ తీసుకోండి
నికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.