Best Breakfast in Morning: డైట్లో ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవడంలా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఇది గ్లూకోజ్ ని తిరిగి నింపుతుంది. దీంతో రోజంతా మన శరీరానికి శక్తి అందుతుంది బ్రేక్ఫాస్ట్ లో విటమిన్స్ పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటు ఫైబర్ ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. ఇది కడుపుకు హాయి ఇవ్వడంతోపాటు దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు కూడా ఇవి చెక్‌ పెడతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటివల్ల మన కడుపు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మన ఆరోగ్యాన్ని కుంటు పడకుండా ఉంటుంది. అంతేకాదు ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల అతిగా తినకుండా ఉంటాం. దీంతో బరువు కూడా పెరగకుండా ఉంటారు క్యాలరీలో మోతాదులు తక్కువగా ఉండే ఆహారాలకు ప్రధాన ప్రాధాన్యతను ఇవ్వండి. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా అతిగా పెరగకుండా ఉంటారు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.


శాండ్విచ్..
కొంతమంది ఉదయం బ్రెడ్‌ శాండ్విచ్ తినే అలవాటు ఉంటుంది. అయితే వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ కి ప్రాధాన్యతను ఇవ్వండి. అంతేకాదు ఇందులో స్వీట్ కాకుండా కొన్ని కూరగాయలు సలాడ్స్ యాడ్ చేసుకుని తీసుకోవడం వల్ల మంచిది ఫైబర్ ఉండే ఆహారాలు ఈ సాండ్విచ్ లో వేసుకొని తీసుకుంటే మీ కడుపుకు ఆరోగ్యంగా ఉంటుంది.


గుడ్లు..
గుడ్లు కూడా మన ఆరోగ్యానికి మంచిదని అంటారు. ప్రతి రోజూ ఒక గుడ్డు తీసుకోమని వైద్యులు చెబుతారు. ఇందులో పోర్డ్చ్‌, స్క్రాంబుల్డ్‌ ఎక్స్ వంటివి తీసుకోవాలి. కొంతమంది ఉదయం బ్రేకఫాస్ట్ లో గుడ్లు తినే అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కడుపుకి కూడా మేలు చేస్తుంది.


ఇదీ చదవండి:  ఆముదం బట్టతలపై కూడా జుట్టుమొలిపించే అద్భుత వరం.. చర్మానికి కూడా బోలెడు లాభాలు..


స్మూథీ..
స్మూథీలో కూడా ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అలాంటివి డైట్లో చేర్చుకోవాలి. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మన కడుపుకు హాయ్ ఇవ్వడంతో పాటు ఎక్కువ సేపు కడుపునిండు నా అనుభూతి కలిగిస్తుంది. అందుకే స్మూతీలను డైట్లో చేర్చుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరగకుండా ఉంటారు ఇవి ఆరోగ్యకరం కూడా.


ఓట్ మిల్..
ఓట్ మిల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డైట్లో చేర్చుకుంటున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఎందుకంటే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది. దీంతో ప్రాణాంతక వ్యాధులు దూరంగా ఉంటాయి. ఓట్ మీలో ఆంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్మీల్‌ తప్పకుండా చేర్చుకోండి.


ఇదీ చదవండి: దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్‌  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.