Kidney Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైంది కిడ్నీ. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచకపోతే మనం ఆరోగ్యంగా ఉండం. అనారోగ్యమే కాదు ప్రాణాంతకం కూడా. మరి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కిడ్నీలు చేసే పని చాలా కీలకమైంది. రక్తాన్ని శుభ్రపర్చడం, విష పదార్ధాల్ని శరీరంలోని తొలగించడంలో మూత్ర పిండాలదే కీలకమైన విది. ఈ విషపదార్ధాలే చాలా సందర్భంగాల్లో కిడ్నీల్ని దెబ్బతీస్తుంటాయి. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ఉత్తమం. కేవలం ఒక డ్రింక్ ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఈ కిడ్నీలను శుభ్రపర్చుకోవడమే కాకుండా పాడైపోకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే శరీరంలోని వ్యర్ధాల్ని ముత్రం ద్వారా బయటటకు పంపిస్తాయి ముత్రపిండాలు. అంతేకాకుండా శరీరంలో సాల్ట్, పొటాషియం, యాసిడ్‌లను సరైన మోతాదులో ఉంచుతాయి. దాంతోపాటు హార్మాన్ ఉత్పత్తికి కూడా దోహదపడతాయి. అటువంటి కిడ్నీలను శుభ్రపరుస్తూ..ఆరోగ్యంగా ఉంచే ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం..


హార్వర్డ్ యూనివర్శిటీ నివేదిక ప్రకారం రోజూ 2 నిమ్మకాయల రసం తీసుకుంటే యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. కిడ్నీల్నించి విష పదార్ధాలు తొలగిపోతాయి. అదే సమయంలో రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల మూత్రం పోసేవారికి కిడ్నీలో స్టోన్స్ ఉండే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే నిమ్మరసంను ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తీసుకోవాలి.


కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడే మూడు డ్రింకులు


ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం, కాస్త పుదీనా ఆకులు, కొద్దిగా పంచదార వేసి బాగా కలపాలి. రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలకు చాలా మంచిది ఇక మసాలా నిమ్మ సోడా. ఇది కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గ్లాసులో నిమ్మరసం, కొద్దిగా ధనియా పౌడర్ , చాట్ మసాలా కొద్దిగా వేసి సోడా ప్రెషర్‌తో వేస్తూ కలపాలి.  ఈ డ్రింక్ కిడ్నీలకు చాలా మంచిది. ఇక కోకోనట్ శికంజీ కూడా చాలా మంచిది. ఓ గ్లాసు కొబ్బరినీళ్లలోలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి.


Also read: White Hair Problem: మీ జట్టు రాలడం, తెల్లబడటం జరుగుతుందా? అయితే ఈ 3 రకాల నూనెలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook