White Hair Problem: మీ జట్టు రాలడం, తెల్లబడటం జరుగుతుందా? అయితే ఈ 3 రకాల నూనెలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి

Which Oil Is Beneficial For Hair: ఈ రోజుల్లో జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలు చిన్న వయస్సులోనే ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ సమస్యకు కొన్ని నూనెలు ఉపయోగించడం ద్వారా చెక్ పెట్టొచ్చు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 04:42 PM IST
White Hair Problem: మీ జట్టు రాలడం, తెల్లబడటం జరుగుతుందా? అయితే ఈ 3 రకాల నూనెలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి

Premature White Hair Problem Solution: జుట్టు రాలడం, తెల్లగా మారడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుండటం మనం చూస్తుంటాం. దీని వెనుక కాలుష్యం, అసమతుల్య ఆహారం, సరైన నిద్ర లేకపోవడం, టైంకు మేల్కొనకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వీటిన్నింటితోపాటు చుండ్రు కూడా మరో సమస్య. దీనికి చెక్ పెట్టడం ఎలాగో తెలుసుకుందాం. 

ఈ 3 సహజ నూనెలు జుట్టుకు ఉత్తమమైనవి
చుండ్రు సమస్యను నివారించడానికి 3 సహజ నూనెలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు అంటున్నారు. విశేషమేమిటంటే, ఈ నూనెలు జుట్టు రాలడం, వైట్ రంగును నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందువల్ల, ఈ సహజ నూనెలను ఉపయోగించడం లాభదాయకమైన పని. ఈ నూనెలు స్కాల్ప్ పొడిబారకుండా కాపాడడమే కాకుండా, అవసరమైన పోషణను కూడా అందిస్తాయి. రెండు వారాల పాటు ఈ నూనెలను వాడిన తర్వాత, మీకు తేడా కనిపిస్తుంది.

జుట్టుకు ఏ నూనె ఉపయోగపడుతుంది?
1. వేపనూనె (Neem Oil)
ముందుగా ఈ నూనెను తయారు చేసేందుకు ఎండు వేప ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానికి ఆలివ్ ఆయిల్ వేయాలి. తర్వాత జుట్టు మూలాలపై అప్లై చేయాలి. 1 నుండి 2 గంటల తర్వాత షాంపూ చేయండి.దీని వల్ల చుండ్రు ఉండదు, జుట్టు రాలదు, తెల్లగా మారదు.

ప్రయోజనాలు- వేపనూనెను సహజ నూనె అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది జుట్టు యొక్క పొడిని తొలగించి, వాటిలో చుండ్రును నివారిస్తుంది. వేపలో యాంటీ ఫంగల్ నాణ్యత ఉంది, ఇది జుట్టును అనేక సమస్యల నుండి రక్షిస్తుంది.

2. కొబ్బరి నూనె (Coconut Oil)
ముందుగా కొబ్బరినూనెను తీసుకుని.. అందులో మెంతి గింజలను వేసి మరిగించాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ రసం కలపండి.

ప్రయోజనాలు- కొబ్బరి నూనె ప్రతి సీజన్‌లో జుట్టుకు అప్లై చేయడానికి చాలా మంచి ఎంపిక. కర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే చుండ్రు తొలగిపోతుంది. ఇది జుట్టును బలంగా మరియు మెరిసేలా చేస్తుంది.

3. నువ్వుల నూనె (Sesame Oil)
ముందుగా నువ్వుల నూనె కొనాలి, ఇప్పుడు దీన్ని వారానికి మూడుసార్లు జుట్టుకు బాగా పట్టించండి.కొద్ది రోజుల్లోనే మీరు మార్పును చూడవచ్చు. 

ప్రయోజనాలు- నువ్వుల నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని, ఇది జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే విటమిన్ ఎ మరియు సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Also Read: Diabetes Diet: మధుమేహానికి చెక్ పెట్టాలనుకుంటున్నారా... అయితే ఈ ఆకుకూర ట్రై చేయండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News