Cervical Pain Tips: సర్వైకల్ స్పోండిలైటిస్ కారణంగా మెడలో తీవ్రమైన నొప్పి ఒక్కోసారి తల తిరగడం సంభవిస్తుంటుంది. ఆధునిక జీవన విధానంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. సర్వైకల్ స్పయన్ బలహీనం కావడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు జీవితం నరకప్రాయంగా కన్పిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ పెయిన్ తీవ్రంగా భాదిస్తుంటోంది. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే నరకప్రాయంగా మారుతుంది. ఈ నొప్పిని భరించడం కష్టమైపోతుంటుంది. కొన్ని సులభమైన వ్యాయామ చిట్కాలతో సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. 


నెక్ టిల్ట్ ఎక్సర్‌సైజ్


నేరుగా కూర్చుని మెడను ఓ వైపుకు వంచాలి. మీ చెవి భుజానికి తగిలేంతవరకూ వంచాలి. ఓ 5-7 సెకన్లు అలానే ఉండి తిరిగి సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు రెండోవైపుకు అలానే వంచి 5-7 సెకన్లు ఉండాలి. మళ్లీ సాధారణ స్థితికి వచ్చేయాలి. ఇలా 5-6 సార్లు చేయాలి. 


నెక్ స్ట్రెచ్ ఎక్సర్‌సైజ్


ముందుగా శరీరాన్ని నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇప్పుడు మీ గెడ్డం భాగాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎంతవరకంటే మీ మెడ లాగినట్టన్పించేంతవరకూ. ఇలా 5 సెకన్లు ఉండాలి. తరువాత సామాన్య స్థితికి రావాలి. ఆ తరువాత మెడను వెనక్కి వంచి మరో 5-6 సెకన్లు ఉంచాలి. ఇలా 5-6 సార్లు చేయాలి.


నెక్ ఎక్సర్‌సైజ్


మీ నడుమును నిటారుగా ఉంటి కూర్చోవాలి. మీ గెడ్డం భాగాన్ని దిగువకు వంచాలి. మీ ఛాతీకి టచ్ అయ్యేంతవరకూ చేయాలి. ఇలా 5 సెకన్లు చేసి తిరికి సామాన్య స్థితికి వచ్చేయాలి. ఇలా 5 సార్లు చేయాలి. 


నెక్ టర్న్ ఎక్సర్‌సైజ్


నడుము నిటారుగా ఉంచటి కూర్చుని మెడను ఓ వైపుకు తిప్పాలి. ఎంతవరకూ వీలైతే అంతవరకూ తిప్పాలి. దాదాపు 5 సెకన్లు అలానే ఉంచి..తిరిగి మామాలుగా ఉంచాలి. ఇప్పుడు రెండోవైపుకు తిప్పాలి. ఇలా మొత్తం 360 డిగ్రీలు తిప్పేందుకు ప్రయత్నించాలి. ఇలా 5-6 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. 


Also read: Parkinsons Disease: పార్కిన్సన్స్ వ్యాధి గురించి మీకు తెలియని నిజాలు, అవాస్తవాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook