Constipation Remedies: మలబద్ధకం సమస్యగా ఉందా..ఈ ఐదు చిట్కాలతో మటుమాయం
Constipation Remedies: ఆహారపు అలవాట్లు సరైన రీతిలో ఉంటే ఏ అనారోగ్యం దరిచేరదు. వేసవిలో ప్రత్యేకించి తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ఇప్పుడు చూద్దాం..
Constipation Remedies: ఆహారపు అలవాట్లు సరైన రీతిలో ఉంటే ఏ అనారోగ్యం దరిచేరదు. వేసవిలో ప్రత్యేకించి తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ ఇప్పుడు చూద్దాం..
మలబద్ధకం సమస్య సాధారణంగా ఎప్పుడైనా సంభవిస్తుంది. ఈ సమస్యతో తరచూ ఇబ్బందిపడేవారికి వేసవిలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మల విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. దాంతోపాటు కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. కడుపు నొప్పి తీవ్ర అసౌకర్యం కల్గిస్తుంది.
మలబద్ధకం సమస్యకు 5 వంటింటి చిట్కాలు
మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేం మీకు చెప్పబోయే కొన్ని చిట్కాలతో వైద్యుని వద్దకు వెళ్లకుండానే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ ఐదు చిట్కాలేంటో పరిశీలిద్దాం..
1. అల్లం చాయ్
కొద్దిగా అల్లం వేడి నీటిలో వేసి టీ తాగినట్టు తాగితే మలబద్ధకం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది అజీర్తి సమస్యను సరి చేయడమే కాకుండా...కడుపు నొప్పుల నుంచి కూడా ఉపశమనం కల్గిస్తుంది.
2. లైకోరైస్
మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే..ఒక స్పూన్ లైకోరైస్ లేదా ములేఠీ పౌడర్‌లో కాస్త బెల్లం కలిపి తినాలి. ఇది శరీరంలోని బౌల్ మూమెంట్‌ను సరిచేస్తుంది. దీనికి ఒక కప్పు వేడి నీటితో తాగడం చాలా మంచిది.
3. నెయ్యి మరియు వేడి పాలు
నెయ్యి మరియు వేడి పాలతో మలబద్ధకం సమస్యకు అద్భుతమైన పరిష్కారముంది. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగాలి. త్వరగా ఉపశమనం లభిస్తుంది. రాత్రి వేళ తాగితే..చాలా ప్రయోజనకరం.
4. అరటిపండు
మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇంకా అద్భుతమైన ఔషధం అరటిపండు. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా మలవిసర్జనలో ఏ విధమైన ఇబ్బంది రాదు.
5. నీళ్లు
మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవాళ్లు..రోజూ సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి.
Also read: Heart Patients: రోజూ ఆ టైమ్‌లోగా నిద్రపోవల్సిందే..లేకపోతే గుండెపోటు ముప్పు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook