Best Joint Pain Relief: ఏం చేసిన కీళ్ల నొప్పులు తగ్గడం లేదా?, ఈ పండ్లు తినండి చాలు!
Best Joint Pain Relief: కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజు పలు పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
Best Joint Pain Relief: ప్రస్తుతం చిన్న వయసులో గల వారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పలు రకాల పండ్లను ప్రతి రోజు తినడం వల్ల కూడా సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి పండ్లు తినడం వల్ల కీళ్ల నొప్పులను నియంత్రించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పండ్లతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి:
యాపిల్ పండ్లు:
కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు లాంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాపిల్ పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
చెర్రీ పండ్లు:
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి చెర్రీస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా కీళ్లలో వాపులను తగ్గించి వాటిని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
జామ పండ్లు:
ప్రతి రోజు జామ పండ్లను తినడం వల్ల కీళ్ల నొప్పులు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీనడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
కివీ పండ్లు:
కివీ పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు రక్తాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలు, కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కివీ పండ్లను తినాల్సి ఉంటుంది.
మామిడి పండ్లు:
కీళ్ల నొప్పులను తగ్గించడానికి వేసవిలో లభించే మామిడి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ కీలక వాపులను నియంత్రిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల దూరం చేసేందుకు సహాయపడుతుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook