Best Morning Drinks for Weight Loss: ప్రతి ఒకరు రోజంతా చురుకుగా ఉండడానికి ఉదయాన్నే టీ లేదా కాఫీని తీసుకుంటూ ఉంటారు. ఆధునిక జీవనశైలిలో భాగంగా కొంతమంది కెఫిన్ అధిక పరిమాణంలో లభించే కాఫీలు కూడా తాగుతున్నారు. అయితే వీటినింటికీ బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించన కొన్ని మార్నింగ్ డ్రింక్స్‌ తాగితే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రింక్స్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల శరీరం రోజంతా చురుకుగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజు ఉదయం ఈ డ్రింక్స్‌ తాగండి:
పసుపు నీరు:

పసుపు నీరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ నీటిని తాగడం వల్ల పొట్టలో మంట తగ్గుతుంది. అంతేకాకుండా శరీర బరువు నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రింక్‌ను తాగాలనుకునేవారు ఒక గ్లాసు వేడి నీటిలో పసుపు పొడి కలిపి, అందులోనే నిమ్మరసం మిక్స్‌ చేసి ప్రతి రోజు తాగడం వల్ల జీవక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ శరీర బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు ఆకలిని తగ్గించి..జీర్ణక్రియ సమస్యలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు శరీర మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ డ్రింక్‌ను తయారు చేసుకోవాలనుకునేవారు ముందుగా ఒక గ్లాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే యాపిల్ వెనిగర్‌ని వేసుకుని, తేనె, నిమ్మరసం కలిపి ప్రతి రోజు ఉదయం తాగితే బెల్లీ ఫ్యాట్‌ తగ్గి, శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 


దాల్చిన చెక్క నీరు:
ఉదయాన్నే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన మొండి కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్‌ కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దాల్చిన చెక్క నీటిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు ఈ నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి