Protein Foods: ప్రోటీన్ ఫుడ్ కోసం మాంసం, గుడ్లే తినాల్సిన అవసరం లేదు, ఇవి తింటే చాలు
Protein Foods: మనిషి శరీర నిర్మాణం, వికాసం, ఎదుగుదలకు ప్రోటీన్లు చాలా చాలా అవసరం. ప్రోటీన్ల లోపం ఏర్పడితే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే తీసుకునే ఆహారం ఎప్పుడూ బాగుండాలి.
Protein Foods: మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా ఉపయోగపడే మైక్రో న్యూట్రియంట్ ప్రోటీన్. మనం రోజూ తీసుకునే ఆహార పదార్ధాల్లో ఇవి ఉంటాయి. అందుకే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేట్టు చూడాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.
ప్రోటీన్లలో ఉండే ఎమైనో యాసిడ్స్ శరీరాన్ని పటిష్టంగా ఉంచుతాయి. కణాల నిర్మాణం లేదా మరమ్మత్తులకు ఉపయోగపడతాయి. అందుకే శరీరంలోని ఎముకలు, చర్మం, కేశాలు, మజిల్స్ ఇతర అంగాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తప్పకుండా తినాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనగానే మాంసం, చేపలు, గుడ్లు గుర్తొస్తుంటాయి. ఎందుకంటే మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శాకాహారంలో తక్కువగా ఉండటం వల్ల శాకాహారుల్లో ప్రోటీన్లు సమృద్ధిగా లభించే అవకాశాలుండవనేది సర్వత్రా విన్పించే మాట. అయితే కొన్ని రకాల శాకాహార పదార్ధాల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
పాలను ఎప్పుడూ కంప్లీట్ ఫుడ్ లేదా సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. కారణం ఇందులో దాదాపుగా అన్ని పోషక గుణాలుంటాయి. ఒకవేళ మీ శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటే రోజుకు 2 గ్లాసుల పాలు తాగే అలవాటు చేసుకోండి. దీనివల్ల శరీరం పటిష్టమౌతుంది. ఊహించని శక్తి అందుతుంది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటారు.
ఇక నట్స్ , డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనాలున్నాయి. డ్రై ఫ్రూట్స్ సహజంగా ఖరీదైనవి కావడంతో రోజూ తినడం సాధ్యం కాకపోవచ్చు అందరికీ. అయితే మార్కెట్లో లభించే వేరుశెనగ అలా కాదు. వేరు శెనగతో కూడా ప్రోటీన్ల లోపాన్ని సరిచేయవచ్చు. వేరుశెనగలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ దరకు అందుబాటులో ఉంటాయి.
ఇక పప్పుల్లో ప్రోటీన్లు లెక్కలేనన్ని ఉంటాయి. శరీరానికి అవసరమైన న్యూట్రియంట్లను ఇవే అందిస్తాయి. రాజమా, శెనగలు, పెసరపప్పు, మసూర్ దాల్ వంటివి మీ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.
సోయా బీన్ కూడా ప్రోటీన్లకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ప్రోటీన్ ఫుడ్ కోసం ప్రతి ఒక్కరూ ముఖ్యంగా శాకాహారులు మాంసం తినలేని పరిస్థితి. అందుకే సోయా బీన్ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువ ఉంటాయి. మీ దినసరి ప్రోటీన్ అవసరాన్ని తీరుస్తాయి.
Also read: Health Tips: పరగడుపున ఏయే పదార్ధాలు తినవచ్చు, ఏవి తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook