Summer Skin Care Tips: వేసవిలో చర్మ సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. పెరుగుతున్న వేడి కారణంగా చర్మం పొడిబారడం, రంగు మారడం, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన చర్మం మెలానిన్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. ఒకవేళ చర్మంపై ఎండ ఎక్కువగా పడితే మెలానిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉంటే చర్మం రంగు మారడం లేదా చర్మంపై ట్యాన్ పెరగడం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే ఈ కింద సూచించిన చిట్కాలు పాటించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫేస్ వాష్ :


బయటకు వెళ్లి వచ్చాక ఫేస్ వాష్‌ను ఉపయోగించి సాధారణ నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఐస్ వాటర్‌తో కడిగితే ఇంకా మంచిది. ఇది చర్మానికి మరింత తాజాదనాన్ని ఇస్తుంది. అలాగే, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ను తప్పక ఉపయోగించాలి. ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. SPF 30  లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.


ఫేస్ ప్యాక్ :


వడదెబ్బ నుండి చర్మాన్ని రక్షించడంలో కలబంద చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అలాగే, పసుపును ఉపయోగించడం కూడా చర్మానికి మంచిది. ఇది చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపునిస్తుంది. పసుపు, పెరుగు కలిపిన మిశ్రమంతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మానికి మంచి నిగారంపు వస్తుంది.


కళ్లు, పెదాల సంరక్షణ :


వేసవిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కళ్లకు సన్ గ్లాసెస్‌ ధరించడంతో పాటు పెదాలకు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ భరించలేని వేడి కారణంగా కళ్లు అలసిపోతే చల్లని నీటిలో ముంచిన కాటన్ వస్త్రాన్ని కళ్లపై కొద్దిసేపు ఉంచాలి. అప్పటికీ ఉపశమనం కలగకపోతే వైద్యుడిని సంప్రదించాలి.


రోజుకు రెండుసార్లు స్నానం :


వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ఫ్రెష్ ఫీలింగ్‌తో పాటు మీ చర్మానికి మంచి సంరక్షణనిస్తుంది. నీళ్లలో కొద్దిసేపు వేపాకులను ఉంచి స్నానం చేస్తే మంచిది. కొద్దిపాటి నీటిలో ఉప్పు వేసి అందులో కాళ్లు, చేతులు ఉంచడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. 


Also read: RRR Crazy Update: డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌


Also read: Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్‌ లను దాటేసాడా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook