Betel Leaf for Hair Growth : తమలపాకుతో ఇలా చేస్తే..ఒత్తైన జుట్టు మీ సొంతం..
Betel leaf: మనలో చాలామందికి చక్కటి ఒత్తయిన జుట్టు సహజంగా ఉండాలి అన్న ఆశ ఉంటుంది. అయితే హెరిడిటరీ, పొల్యూషన్ వంటి కారణాలవల్ల జుట్టు పల్చగా అయిపోతుంది. అలాగని జుట్టు పెంచడం కోసం కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు కదా.. అందుకే సహజంగా ఇంటి వద్దనే జుట్టు ఎలా పెంచుకోవాలి అనేదానికి చక్కటి ఉపాయం మీకోసం.
Natural hair care: నేటి హడావిడి జీవనశైలి , అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. స్ట్రెస్ తో కూడిన జీవితం ఇలా ఎన్నో కారణాలవల్ల చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. చక్కగా ఒత్తుగా ఉండే జుట్టు కావాలి అని కెమికల్ ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారి కోసం ఇంటివద్దని సులభంగా దొరికే పదార్థాలతో నేచురల్ గా జుట్టును ఒత్తుగా పెంచుకోవడం ఎలాగో చూద్దాం.
తరచూ మనము తాంబూలాలకి వాడే తమలపాకులను ఉపయోగించడం వల్ల జుట్టుకు ఎంతో మేలు కలుగుతుంది. ఇది నాచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఇటువంటివి వాడడం వల్ల మన స్కాల్ప్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పొల్యూషన్ వల్ల బలహీన పడ్డ జుట్టు అయినా.. మృదుత్వం కోల్పోయి రఫ్ గా మారిన కురులైన ఈ చిన్ని చిట్కా వల్ల అందంగా మారతాయి.
తమలపాకులను ఎప్పటినుంచో వంటింటి చిట్కా వైద్యంలో ఉపయోగిస్తూ ఉన్నారు. తమలపాకులో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.తమలపాకులో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఎ ,సి, బి 2, బి 1 అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ఇవి జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాకుండా తమలపాకులో యాంటీమైక్రోబయాల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. జుట్టు కుదుళ్ళు దగ్గర వచ్చే పలు రకాల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ని ఇవి నిరోధిస్తాయి.
మీ హెయిర్ కి తమలపాకుల ట్రీట్మెంట్ ఇవ్వడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. హెయిర్ లెన్త్ కు అవసరమైన తమలపాకులు తీసుకొని నీట్ గా వాష్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కి ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి కలిపి ,ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా అప్లై చేసి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో.. కెమికల్స్ లేని షాంపు ఉపయోగించి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల తమలపాకులోని పోషకాలు జుట్టుకు అందుతుంది. జుట్టు చివర్ల చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్ళ నుంచి ఎంతో ఆరోగ్యంగా,దృఢంగా,మృదువుగా పెరుగుతుంది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook