Better Sleep: రాత్రి పడుకునే ముందు ఈ చిన్నపని చేస్తే గాఢనిద్రలోకి జారుకుంటారు..
Better Sleep Drinks: చమోమిలే టీలో నిద్రకు ఉపక్రమించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంగ్జైటీ ని తగ్గిస్తాయి మంచి నిద్రకు ప్రేరేపిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు చమోమిలే టీ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల గాడు నిద్రలోకి జారుకుంటారు
Better Sleep Drinks: రాత్రి సరైన నిద్ర పడితేనే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. దీనికి పడుకునే ముందు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవాలి. దీంతో మంచి నిద్ర పడుతుంది వీటి వల్ల గాఢ నిద్రలోకి వెళ్తారు. ఉదయం ఫ్రెష్ గా కనిపిస్తారు. కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవడం వల్ల నిద్ర క్వాలిటీ మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తీసుకోవాలి. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ 5 రకాల డ్రింక్స్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
చమోమిలే టీ..
చమోమిలే టీలో నిద్రకు ఉపక్రమించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంగ్జైటీ ని తగ్గిస్తాయి మంచి నిద్రకు ప్రేరేపిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు చమోమిలే టీ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల గాడు నిద్రలోకి జారుకుంటారు ఇది మెదడును శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
గోరువెచ్చని పాలు..
పాలలో ట్రైప్తో ఫ్యాన్ ఏమైనా ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సెరోటినైన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో గాఢ నిద్ర పడుతుంది రాత్రి పడుకునే ముందు మీ రెగ్యులర్ డైట్ లో ఈ గోరువెచ్చని పాలన చేర్చుకోవడం వల్ల నిద్రకు ఉపక్రమిస్తారు. ప్రతిరోజు ఒక గ్లాసు మిల్క్ తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..
బాదం పాలు..
బాదం పాలతో కూడా మంచి నిద్ర పడుతుంది బాదం లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు ప్రేరేపిస్తుంది మా కండరాలను రిలాక్స్ చేస్తుంది. బాదాం మిల్క్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు ఇందులో ఉపశమనం కలిగించే గుణాలు ఉంటాయి.
గోల్డెన్ మిల్క్..
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది పాలలో పసుపు వేసుకొని రాత్రి గోరువెచ్చగా తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది రాత్రి పడుకునే ముందు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం ఎఫెక్టివ్ రెమిడి. అంతేకాదు ఈ పసుపు పాలు గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది.
అలం టి..
ప్రతిరోజు అలాంటి మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా నిద్ర ఉపక్రమిస్తారు. ఇది మంచి జీర్ణ క్రియ కు తోడ్పడుతుంది రొంప సమస్యలకు చెక్ పెడుతుంది రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల రిలాక్స్ గా ఉంటారు మంచి నిద్రలోకి జారుకుంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? బామ్మల కాలం నాటి అద్భుత చిట్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.