Covaxin Booster Dose: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా బూస్టర్ డోసు ప్రాధాన్యత సంతరించుకుంది. కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో మంచి ఫలితాలున్నాయని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. దేశంలో రోజుకు పదివేల కేసుల నుంచి ఒక్కసారిగా లక్షన్నర కేసుల వరకూ పెరిగిపోయింది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల వారం రోజుల క్రితం 15-18 ఏళ్లున్న చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. మరోవైపు కరోనా విజృంభిస్తుండటంతో కోవిడ్ బూస్టర్ డోసు కూడా ప్రారంభమైంది. 


కరోనా బూస్టర్ డోసు విషయంలో ప్రముఖ ఫార్మా దిగ్గజం కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్ కంపెనీ గుడ్‌న్యూస్ అందించింది. కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో (Covaxin Booster Dose) ఏ విధమైన దుష్ఫ్రభావాలుండవని..దీర్ఘకాలిక రక్షణ కల్పించే సామర్ధ్యం ఈ వ్యాక్సిన్‌కే ఉందని భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో మంచి ఫలితాలున్నాయని వెల్లడించింది. కోవాగ్జిన్ బూస్టర్ డోసు ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్ ఫలితాల్ని కంపెనీ వివరించింది.


కోవాగ్జిన్ (Covaxin) 2 డోసులు తీసుకున్న వాలంటీర్లకు 6 నెలల అనంతరం బూస్టర్ డోసు ఇచ్చినట్టు భారత్ బయోటెక్ కంపెనీ (Bharat Biotech) తెలిపింది. రెండు డోసుల ప్రభావంతో యాంటీబాడీలు ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాయని పేర్కొంది. 90 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకున్నవారిలో యాంటీబాడీల సంఖ్య 19 నుంచి 265కు పెరిగింది. రెండవ డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించింది. పిల్లలకు, పెద్దలకు కోవాగ్జిన్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు మార్గం సుగమమైందని కంపెనీ తెలిపింది. 


Also read: Bad Cholesterol: బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసే ఆహార పదార్ధాల జాబితా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook