Black Blood During Period: పీరియడ్స్ సమయంలో బ్లాక్ బ్లెడ్ వస్తుందా ?
Black Blood During Period Causes: నేటికాలంలో యువత, మహిళలను వేధించే సమస్యలలో పీరియడ్స్ సమయంలో కలిగే అనారోగ్య సమస్యలు. ఈ సమయంలో రక్తస్రావం రంగు ద్వారా ఆరోగ్యం ఎలా ఉందో చెప్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Black Blood During Period Causes: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలలో పీరియడ్స్ సమయంలో వచ్చే అలసట, కడుపు నొప్పి, హార్మోన్ల మార్పుల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలలో వచ్చే రక్తస్రావం రంగుతో ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొంత మందిలో రక్తం అనేది నల్లబడతుంది. ఈ ఎందుకు వస్తుందని అనేది తెలుసుకుందాం.
పీరియడ్స్‌లో డార్క్ బ్లడ్ డిచ్ఛార్జ్ ఎక్కువగా కొంతమందిలో కనబడుతుంది. అయితే దీనికి కారణం ఎక్కువగా ఆహారం, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల వల్ల కలుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్ వంటి మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు కూడా దీనికి కారణమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
[[{"fid":"293568","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నల్లరక్తం అనేది చాలా కాలం తర్వాత గర్భాశయం నుంచి వచ్చే పాత రక్తం అని వైద్యలు చెబుతున్నారు. అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ నల్లటి పీరియడ్స్ రావచ్చని చెబుతున్నారు. టాంపోన్స్, కాపర్ టీ ఉపయోగించే వారిలో కూడా ఈ బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ అనేది సంభవిస్తుంది. దీని వల్ల దుర్వాసన, వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
Also Read Pomegranate Detox Juice: ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా తొలుగుతాయి!
ఈ సమస్య అనేది మొదటి పీరియడ్స్ లేద మోనోఫాజ్ సమయంలో కూడా మహిళలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ టైమ్‌లో రక్తప్రసరణ తగ్గుతుంది. ఈ సమయంలో బయటకు వచ్చే రక్తం రంగు ఎరుపు నంచి గోధుమ లేద నలుపు రంగులో మారుతాయి. దనీ వల్లనే రక్తం నల్లగా వస్తుంది.
ఈ సమస్యలలో యూరిన్ విసర్జన చేయడంలో ఇబ్బంది, పెల్విక్ ప్రాంతంలో నొప్పి చలితో కూడిన జ్వరం వంటి లక్షణాలను కనిపిస్తాయి.
బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ ఒకటి లేదా రెండుసార్లు సంభవించినట్లయితే సాధారణమైనదిగా పరిగణించబడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీలో ఈ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. కొన్నిసార్లు శరీరంలో తలెత్తే వ్యాధులకు సంకేతం కావచ్చని చెప్పవచ్చు.
Also Read Apple Vinegar Benefits: యాపిల్ వెనిగర్‌ను ఖాళీ కడుపుతో తాగడం మంచిదేనా.. మీరు కూడా ఇలా తాగుతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter