Black Coffee Health Benefits: ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచడంలో బ్లాక్‌కాఫీ కీలకపాత్ర పోషిస్తుంది. బెడ్‌కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీతో కలిగే ప్రయోజనాలివే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్‌కాఫీతో బరువు కూడా తగ్గించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. బ్లాక్‌కాఫీతో గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు చాలా ఇతర ఆరోగ్య ప్రయోజనాలున్నాయి బ్లాక్‌కాఫీతో. అవేంటో తెలుసుకుందాం. బ్లాక్‌కాఫీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే కెమికల్ కాంపౌండ్లు చాలా శక్తిమంతమైనవి అవి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ప్రాణాలు తీసే కాన్సర్ వ్యాధి రాకుండా కాఫీ అడ్డుకోగలదని నిపుణులు చెబుతున్నారు.


అమెరికా వ్యవసాయ విభాగం ప్రకారం..కాఫీ గింజలతో తయారుచేసిన ఓ కప్పు బ్లాక్‌కాఫీలో 2 కేలరీలు ఉంటాయి. అంటే కాఫీలో కేలరీలు తక్కువే. అయితే.. కాఫీకి అదనంగా బెల్లం, పంచదార, పాలు, వెనీలా, సోయా మిల్క్, చాకొలెట్ సిరప్ వంటివి జత చేయకుండా తాగితే మంచిది. బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్లాక్‌‌కాఫీలో క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల రాత్రి భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది.  


బ్లాక్‌కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కెఫిన్‌ అనే పదార్థం మెదడును, కేంద్ర నాడీ వ్యవస్థను చురుకుగా పని చేసేందుకు సహాయపడుతుంది. మనిషి శక్తి సామర్ధ్యం మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. 
బాడీలో నీరు ఎక్కువైతే కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట పెరుగుతుంది. బ్లాక్‌కాఫీ బాడీలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. అందుకే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


గ్రీన్‌ కాఫీ గింజలు మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది కాలేయానికి సహాజమైన క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, మితిమీరిన లిపిడ్‌లను తొలగించి జీవక్రియ సమర్ధవంతంగా పని చేసేలా చేస్తుంది.


Also read: Green Mango Benefits: పచ్చి మామిడితో ఆరోగ్య ప్రయోజనాలు, ఇన్‌స్టంట్ ఎనర్జీతో పాటు నోటి సమస్యలు దూరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook