Black Fungus: కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్నరోగులిప్పుడు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ సమస్యతో పాటు బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఇది ప్రాణాంతకంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ (Corona Second Wave) రూపంలో ఇండియాపై తీవ్రమైన దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు కోవిడ్ రోగుల్లో కొత్త భయాన్ని కల్గిస్తున్నాయి. ప్రతిరోజూ కోవిడ్ కొత్త రూపం దేశ ఆరోగ్య రంగాన్ని సవాలు చేస్తోంది. దేశంలోని పెద్ద ఆసుపత్రుల్లో సైతం ఆక్సిజన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వైరస్ మ్యూటేషన్ మరింత విధ్వంసకారిగా మారుతోంది. డయాబెటిస్, హార్ట్ ఎటాక్, బ్లాడ్ క్లాటింగ్ తరువాతే ఇప్పుడు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వేధిస్తున్నాయి.


కరోనా ఈ కొత్త రూపం ప్రజల్లో భయందోళనలు రేపుతోంది. మ్యూకోర్ మైకోసిస్‌గా(Mucormycosis) పిలుస్తున్న ఈ వ్యాధి ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందిన రోగుల్లో కన్పిస్తోంది. ఈ వ్యాధి తీవ్రత, పెరుగుతున్న పరిస్థితి చూసి గుజరాత్ వంటి పలు ప్రాంతాల్లో అయితే ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. అసలీ మ్యుకోర్ మైకోసిస్‌కు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా గుర్తించాలి, లక్షణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.


మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి మనిషి శరీరంలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. దీన్నే సింపుల్‌గా బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నాం. రోగి బ్రెయిన్, ఊపిరితిత్తులు, చర్మంపై కూడా ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది. చాలామంది బ్లాక్ ఫంగస్ కారణంగా చూపు కోల్పోతున్నారు. అదే సమయంలో మరికొంత మంది రోగులకు నాసల్ బోన్ సమస్యలు వస్తున్నాయి. ఇది కాకుండా ఇంకా చాలా ఇతర ఇబ్బందులు వస్తున్నాయి. తగిన సమయంలో ఇవి నియంత్రించబడకపోతే రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. బ్లాక్ ఫంగస్ అనేది అంతర్గతంగా వ్యాపించే ఫంగల్ ఇన్‌ఫెక్షన్. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ అయితే చర్మంపై రకరకాల రూపంలో వస్తుంది. చర్మంపై దురద ఉండవచ్చు. చికిత్స ద్వారా తగ్గుతుంది. బ్లాక్ ఫంగస్ ద్వారా రోగి చనిపోయే ప్రమాదం లేకపోలేదు.


కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ సమస్యలు ఎదురవుతుంటాయి. బ్లాక్ ఫంగస్ లక్షణాలు( Black Fungus Symptoms) చాలా ఉన్నాయి. పళ్ల నొప్పి, పళ్లు విరగడం, దవడ నొప్పి, పార్శ్వ లేదా పూర్తిగా నొప్పి, ఛాతీ నొప్పి, శ్వాసలో ఇబ్బందితో పాటు నెమ్మదిగా కళ్ల ఎరుపుగా మారడం, కనురెప్పల్లో నొప్పి వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. ముక్కులో సమస్యలు ఎదురవుతాయి. యూఎస్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 54 శాతం మంది మ్యూకోర్ మైకోసిస్‌తో చనిపోతున్నారు. 


Also read: Sputnik Lite: ఒక్క డోసు టీకాతో కరోనాను తరిమేస్తామంటున్న Russia శాస్త్రవేత్తలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook