Black Fungus Target: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు భయపెడుతున్న వ్యాది బ్లాక్ ఫంగస్. కరోనా రోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బ్లాక్ ఫంగస్..ఏ వయస్సువారిని లక్ష్యంగా చేసుకుంటుందనే విషయంపై కీలకమైన అధ్యయనం వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఆ వయస్సువారికే ఎక్కువగా వస్తుందని తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్‌లో(Corona Second Wave) వైరస్ బెడదతో పాటు తీవ్ర సమస్యగా మారి ప్రాణాంతకమవుతున్న వ్యాధి బ్లాక్ ఫంగస్(Black Fungus) వ్యాధి. మ్యూకోర్ మైకోసిస్‌గా పిలిచే ఈ వ్యాధి అతి ప్రమాదకరంగా మారింది. కోవిడ్ రోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ రోగుల్లో ఏ వయస్సువారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే అంశంపై కీలక విషయాలు వెలుగు చూశాయి. మ్యూకోర్ మైకోసిస్(Mucormycosis) వ్యాధి ఎక్కువగా 45 ఏళ్లు దాటినవారినే లక్ష్యగా చేసుకుంటోంది. అందులో డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మరీ ప్రమాదకరం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1179 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు గుర్తించగా..వీరిలో 1139 మంది కోవిడ్ సోకినవారే. మరి కొద్దిమందైతే కోవిడ్ రాకపోయినా..వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న 40 మందికి సోకింది. ఇందులో 18 ఏళ్లు దాటిన వారిలో 415 కేసులుంటే..18 ఏళ్ల లోపు వారిలో 3 కేసులున్నాయి.


ఈ వ్యాధి కారణంగా ఏపీలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా..అందరూ కోవిడ్ బారిన పడినవారే.1179 కేసుల్లో 743 మంది డయాబెటిస్ బాధితులు కోవిడ్(Covid Virus) సోకిన తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. 251 మంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి ప్రభావితులయ్యారు. క్యాన్సర్, గుండె జబ్బు, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారిలో 130 మందికి ఈ వ్యాధి సోకింది. బ్లాక్ ఫంగస్ (Black Fungus) కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంజక్షన్ల వినియోగం పెరిగింది. జూన్ రెండవ వారానికి 79 వేల ఇంజక్షన్లు అవసరమౌతాయని అంచనా వేస్తున్నారు. కోవిడ్ సోకి..45 ఏళ్ల వయస్సు దాటితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.


Also read: Anandaiah Corona Medicine: ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తారు..ఏ మందు దేనికి వాడాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook