Weight Loss Diet: మినప పప్పులో బరువు తగ్గొచ్చా? ఇలా తింటే దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్!
Black Gram For Weight Loss: క్రమం తప్పకుండా మినప పప్పును ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.
Black Gram For Weight Loss: మినప పప్పులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అందుకే పూర్వీకులు వీటిని ఆహారంలో ఉక్కువగా వినియోగించేవారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పప్పుతో సంబార్ చేసి ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. మినుములతో ఆహార పదార్థాలు చేసుకుని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మినప పప్పులో కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్లు ఎ, బి, సి, డితో చాలా రకాల పోషకాలు అందుతాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మినప పప్పుతో ఈ సమస్యలకు చెక్:
డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?:
ప్రస్తుతం చాలా మంది తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో మినప పప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
బాడీకి ఎనర్జీ ఇస్తుంది:
మినప పప్పును రాత్రి పూట నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జి లభిస్తుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుందని ఆర్యోగ నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటూ వ్యాయామాలు చేయడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
శరీర బరువును నియంత్రించడానికి మినప పప్పు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ గుణాలు శరీర బరువును నియంత్రిస్తాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
అజీర్ణం, తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మినప పప్పును వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా లభిస్తుంది. కాబట్టి శరీరాన్ని డిటాక్స్ చేసి జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి