Black Grapes Benefits: నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Black Grapes Benefits: పండ్లలో నల్ల ద్రాక్ష వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గుండె జబ్బులు, మధుమేహం వ్యాధి గ్రస్తులు నల్ల ద్రాక్ష తినడం వల్ల వారి ఆరోగ్యం కొంత మెరుగవ్వచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Black Grapes Benefits: మన శారీరక ఎదుగుదలకు పండ్లు చాలా ముఖ్యమైనవని అందరికి తెలిసిన విషయమే. అందులో నల్ల ద్రాక్ష ఒక్క దాని వల్లే అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? నల్ల ద్రాక్షలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు ఉన్న కారణంగా రక్తంలో చక్కెర తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు అనేక వ్యాధులను నివారిస్తుంది.
ఈ నల్ల ద్రాక్ష దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో పుష్కలంగా లభిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య.. మూడు నెలల పాటు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్, కర్కుమిన్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి నల్ల ద్రాక్ష వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
డయాబెటిస్ ను నియంత్రిస్తుంది
నల్ల ద్రాక్ష తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే విధంగా నల్ల ద్రాక్షను అతిగా తినవద్దు. ఎందుకంటే చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెరను పెంచుతుంది.
అంతే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తుల కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా నల్ల ద్రాక్ష సహాయపడుతుంది. మీడియా నివేదికల ప్రకారం, నల్ల ద్రాక్షలో లుటిన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి రెటీనాను ఆరోగ్యంగా ఉంచడం సహా ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ కళ్లను లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దృష్టిని మెరుగుపరుస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ అదుపులో..
నల్ల ద్రాక్ష తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నల్ల ద్రాక్షలోని సైటోకెమికల్స్ గుండెకు మేలు చేస్తాయి.
జుట్టు ఆరోగ్యంగా..
జుట్టు సమస్యలు ఉన్నవారు నల్ల ద్రాక్షను తినవచ్చు. నల్ల ద్రాక్షలో ఉండే విటమిన్-ఇ జుట్టుకు మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
జ్ఞాపకశక్తి మెరుగు
నల్ల ద్రాక్ష మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్ష మెదడు పనితీరును పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా.. కొందరు వైద్యుల సూచన మేరకు అందిచబడింది. వీటిని పాటించే ముందు మరోసారి వైద్యుడ్ని సంప్రదిస్తే మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Tooth Sensitivity Cure: టూత్ సెన్సిటివిటీతో బాధపడుతున్నారా? ఈ 5 చిట్కాలను పాటించండి!
Also Read: Diabetes Reduction Diet: రక్తంలో చక్కెర స్థాయి తగ్గాలంటే ఈ ఆహార నియమాలు పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.