Weight Loss: చలికాలంలో నల్ల మిరియాలతో కూడా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా?
Black Pepper For Weight Loss: నల్ల మిరియాల ప్రతి రోజు తీసుకోవడం వల్ల శీతాకాలంలో సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
Black Pepper For Weight Loss: నల్ల మిరియాలు ఆహారాల రుచి పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది వీటిని వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే చలికాలంలో వీటిని అధికంగా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌తో పాటు యాంటీ ఫ్లాట్యులెన్స్, డైయూరిటిక్, డైజెస్టివ్ లభిస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా శీతాకాలంలో వినియోగించడం వల్ల డైజెస్టివ్ సిస్టంను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా శరీర బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది.
నల్ల మిరియాల వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడం:
వేసవితో పోలిస్తే శీతాకాలంలో సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. అయితే చలికాలంలో సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆహారంలో నల్లమిరియాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే పైపెరిన్, యాంటీ ఒబెసిటీ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి.
జలుబు, దగ్గు సమస్య:
శీతాకాలంలో తరచుగా జలుబు, దగ్గు సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా నల్లమిరియాలతో తయారు చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటిని కషాయంలా తయారు చేసుకుని తాగడం వల్ల కూడా దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలా మంది గొంతు నొప్పి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నల్లమిరియాలు తీసుకోవాల్సి ఉంటుంది.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు రావడం సర్వసాధరణం. ఈ సమస్యల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నల్ల మిరియాలతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు మెరుగుపడతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సామర్థ్యం కూడా పెరుగుతుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:
చలికాలంలో తరచుగా కండరాలునొప్పులు, కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి నల్ల మిరియాలు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఆహారంలో కీళ్ల నొప్పులు, వాపు నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆర్థరైటిక్ లక్షణాలు తీవ్ర నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి