Black Salt Benefits In Telugu: వంటగదిలో మసాలాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆహార పదార్థాల్లో మసాలా దినుసులను ప్రతి రోజు వినియోగించడం వల్ల బాడీకి చాలా రకాల లాభాలు కలుగుతాయి. మసాలా దినుసుల్లో ఎక్కువగా శరీరానికి లాభాలను అందిచేవాటిలో జీలకర్ర, అల్లం, కొత్తిమీర, మెంతులు, నల్ల ఉప్పు ముందుంటాయి. అయితే చాలా మందికి సందేహం కలగవచ్చు. ఎందుకంటే ఉప్పును వినియోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని. కానీ బ్లాక్‌ సాల్ట్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాలా కలుగుతాయి. అయితే బ్లాక్‌ సాల్ట్‌ వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్‌ సాల్ట్‌లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంతో పాటు చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో ప్రతి రోజు తీసుకోవడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది:
బ్లాక్‌ సాల్ట్‌:

ప్రతి రోజు నల్ల ఉప్పును తినడం వల్ల గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కూడా పెరగకుండా కూడా ఉంటుంది. దీంతో పాటు గుండె సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. 


ఎసిడిటీని తగ్గిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి తీవ్ర పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా కొంతమందిలో కాలేయ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు తప్పకుండా ఆహారాల్లో బ్లాక్‌ సాల్ట్‌ని వినియోగించాల్సి ఉంటుంది.


మధుమేహానికి చెక్‌:
మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఆహారా పదార్థాల్లో బ్లాక్‌ సాల్ట్‌ని వినియోగించడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తపోటు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


జీర్ణక్రియను మెరుగుపరచుతుంది:
ప్రతి రోజు నల్ల ఉప్పును ఆహారాల్లో వినియోగించడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు పొట్ట కూడా శుభ్రమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు నీటిలో కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter